సూచిక: 'ధారావాహికలు'
Feb2010
కొడవటిగంటి కుటుంబరావు
ఆంగ్ల మూలం: సర్ ఆర్థర్ కోనన్ డాయిల్
తెలుగు: కొడవటిగంటి కుటుంబరావు
పూర్వ భాగం
1. మిస్టర్ షెర్లాక్ హోమ్స్
1878లో లండన్ విశ్వవిద్యాలయంలో డాక్టరాఫ్ మెడిసన్ పట్టం సంపాదించి, సైనిక వైద్యాధికారి కావటానికిగాను ప్రత్యేక శిక్షణ పొందటానికై నెట్లీ వెళ్ళాను. అక్కడ శిక్షణ పూర్తికాగానే నన్ను ఫిప్త్ నార్తంబర్లాండ్ ఫ్యుసిలియర్స్ దళంలొ అసిస్టెంట్ సర్జన్ గా నియమించారు. ఆ సమయంలో ఈ దళం ఇండియాలో ఉన్నది. నేను దానిని చేరుకునే లోపుగా రెండవ ఆఫ్ఘన్ యుద్ధం ఆరంభమయింది. మొత్తం చదవండి »
అనువాదాలు, ధారావాహికలు, నేర పరిశోధన
Jun2009
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
ఎనభై ఐదేళ్ల క్రితం
భూత నటులు అనుకునే వారు
నాట్యం చేయడం ద్వారా
తాము భూమిని మారుస్తామని.
మనల్ని మార్చుకోడానికే నాట్యం చేస్తాం.
మనం మారినప్పుడు మాత్రమే
భూమిని మార్చడానికి ప్రయత్నించగలం.
- క్రౌ డాగ్, 1974
మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత
Apr2009
ఎన్. వేణుగోపాల్
- మూలం: ఆంటొనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
తర్వాత కొన్ని రోజులపాటు మారియో తన అలంకారాలలో, పదచిత్రాలలో మునిగిపోయి తిరుగుతూ ఉండిపోయాడు. బీట్రిజ్ తన గదిలోనే బందీ అయి ఉండిపోయింది. లేదా బయట ఏదయినా కొనడానికి వెళ్లినప్పుడో, కొండలమీద నడవడానికి వెళ్లినప్పుడో, ఆమె మణికట్టులో తల్లి పంజా గుచ్చుకుని ఉండేది. మారియో కూడ వాళ్ల వెనకాలే కాస్త దూరంలో వెంటాడుతుండేవాడు. దారిపొడుగునా వాళ్లకు కనబడకుండా ఉండేదుకు ఇసుక కుప్పలవెనుక దాక్కుంటూ నడుస్తుండేవాడు. తన ఉనికి బీట్రిజ్ మెడకు కట్టేసిన బరువైన బండరాయిలాగ ఉందని మారియోకు సంపూర్ణంగా తెలుసు. ఆ అమ్మాయి తల తిప్పి చూడడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఆమె గూబ గుయ్యిమనేలా ఒక దెబ్బపడేది. అది ఆమె మంచికొరకే కావచ్చుగాని, చాల బాధ కలిగించేలా ఉండేది. మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్
Jan2009
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
పాత షెయాన్ సామెతను మరోసారి మరోసారి గుర్తు తెచ్చుకుందాం: “తన జాతి స్త్రీల గుండె ధైర్యం సడలిపోనంతవరకూ ఆ జాతి ఓడిపోయినట్లు కాదు” . వూండెడ్ నీ ముట్టడి కొనసాగుతున్నంత కాలం మా స్త్రీలు మరింత దృఢంగా నిలబడ్డారు. ఒక బంకరును ఓ దంపతుల జంట తమ అదుపులో ఉంచుకున్నారు. భర్తకు ఎన్నో బుల్లెట్లు తగిలినా ఆ బంకరును తానొక్కతే అదుపు చేస్తానని భార్య పట్టుబట్టింది. మొత్తం చదవండి »
అపరాజిత
Nov2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
ఒకరోజు పొద్దున్నే బంకర్లలో వున్న మా సెక్యూరిటీకి కాఫీ తీసుకువెళ్తున్న నామీద కాల్పులు మొదలుపెట్టారు మార్షల్స్ . అపాచీ తెగకు చెందిన కార్లోస్ అనే యువకుడు నా వైపు దూసుకొచ్చి, నన్ను కిందకు తోసి తన శరీరంతో నన్ను కప్పాడు. నేను పొట్టిగా వుంటాను. ఆ అబ్బాయి నాకంటే చిన్నగా వున్నాడు. మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
Oct2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
వూండెడ్ నీ ని స్వాధీనం చేసుకున్న డెభ్బై ఒక్క రోజుల్లో సేక్రెడ్ హార్ట్ చర్చి, గిల్డర్ స్లీవ్ ట్రేడింగ్ పోస్ట్ , మ్యూజియమ్ లు మూడు ప్రధాన కేంద్రబిందువులయ్యాయి. మాకు ట్రేడింగ్ పోస్టు ముఖ్యమనిపించింది. దానికదే చిన్నిపాటి సామ్రాజ్యంలా వుండింది. దాంట్లో ఇండియన్ చేతి కళలు, చిత్రకళలు వున్న అంగడి, ఒక సూపర్ మార్కెట్ , మరెక్కడా దొరకని అధ్వాన్నమైన పిజ్జా అమ్మే కాఫెటేరియా, ఫిల్లింగ్ స్టేషన్ , మేనేజరు కుంటుంబం వుండే ఇల్లు – ఇలా ఎన్నో అంగళ్లు , రూములు వున్నాయి ఆ ట్రేడింగ్ పోస్టులో. మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
Oct2008
ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
మారియోకు అందిన కొత్త పుస్తకంలో పుటలు ఎంత సుతి మెత్తగా ఉన్నాయో. ఎట్లా తెల్లగా మెరిసిపోతున్నాయో. మారియోకు తన కవితల లాంటి కవితలతో ఆ కాగితాలను చెడగొట్టడానికి మనసొప్పలేదు. అప్పటివరకూ రాస్తున్న పొడుపుకథల లాంటి కవితలతో తన నోటు పుస్తకాలన్నీ నిండిపోయినతర్వాత, మాంచి ఖరీదయిన ఫ్లారెస్ ద ప్రవియా సబ్బుతో చేతులు శుభ్రంగా తోముకుని అప్పుడు మాత్రమే ఈ కొత్త పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవాలనీ, ఆ తెల్లని కాగితాల మీద తాను రాసిన వాటిలోంచి అత్యుత్తమమైన అలంకారాలకు ఆకుపచ్చని సిరాతో సాఫు ప్రతి రాస్తాడు. సరిగ్గా నెరూడా లాగనే.
మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
Sep2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
నన్నడిగితే వూండెడ్ నీ సంఘటన రాపిడ్ సిటీలో మొదలయ్యిందని చెబుతాను. ఇది జాన్ వైన్ల * దేశం. ఆ వూరిలోని తెల్లవాళ్లందరూ మార్ల్ బరో అడ్వర్టైజుమెంటులోని హీరోలా వుండడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పటికి నేను ఇంకా క్రౌ డాగ్ ను పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో నేనొక యువకుడితో ప్రేమలో వున్నాను. అతడిలో మంచి నాన్న అయ్యే మాట అటుంచి, ఒక భర్త అయ్యే లక్షణాలు ఏ కోశానా లేవు. మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
Sep2008
ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
దూరం నుంచి పాబ్లో నెరూడా రావడాని సారాకొట్టులో ఉన్న ఒకేఒక్క పల్లెకారుడు చూశాడు. నెరూడా వెంట ఒక తోలు సంచీ వేసుకున్న కుర్రాడెవడో కూడ ఉన్నాడు. అది చూడగానే ఆ పల్లెకారుడు కొత్త పూటకూళ్లమ్మ చెవిన ఆ మాట వేశాడు. చూడు, చూడు ఎవరో మంచి ఖాతాదార్లు, కనీసం వారిలో సగం మంది మంచి ఖాతాదార్లు, వస్తున్నారు అని. మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
Aug2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
నేను రాడికల్నో రెవల్యూషనరీనో అని నేను అనుకోను. అలాంటి లేబుల్సు తెల్లవాళ్లు మామీద రుద్దారు. ఎప్పుడైనా మేము కోరుకున్నదల్లా మా బతుకులు మమ్మల్ని మాకు తోచినట్లు బతకనివ్వమని మాత్రమే. పేపరు మీద మాత్రమే రాసినట్లు కాకుండా నిజంగానే మమ్మల్ని మేము పరిపాలించుకోనివ్వమని , మా హక్కుల్ని గుర్తించమని ! అలా డిమాండు చెయ్యడం రెవల్యూషనరీ అయితే నేను ఆ వర్ణనకు సరిగా సరిపోతాను. మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
Aug2008
ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
టెలిగ్రాఫ్ ఆపరేటర్ కోస్మెకు రెండు సూత్రాలు చాల ఇష్టమైనవి.
వాటిలో ఒకటి సోషలిజం. దాని గురించి ఆయన తన దగ్గర పనిచేసేవారి బుర్రలు తింటుండేవాడు. వాళ్లందరూ అప్పటికే ఆ సిద్ధాంతానికి సానుభూతిపరులో, కార్యకర్తలో అయినా సరే.
రెండో సంగతేమో పోస్టాఫీసులోపల పోస్టాఫీసు టోపీ పెట్టుకోవడం. మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
Jul2008
ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
(ప్రాణహిత మే 2008 సంచిక తరువాయి) మారియోకు నెరూడా ఏమి చెప్పదలచుకున్నాడో అర్థమయింది. “వారెవ్వా, నాకూ కవి కావాలని ఉంది” అన్నాడు.
“తెలుసా, చిలీలో ప్రతివాడూ కవే! కవి కానిదెవడులే? అయినా పోస్ట్ మన్ ఉద్యోగమంటే కవిత్వం వస్తుందన్నమాటే. ఒక్కటే తేడా, నీకు నడక ఎక్కువగా ఉంటుంది. అంత తొందరగా లావెక్కవు. చిలీలో మా కవులందరికీ బాన పొట్టలున్నాయి.”
మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
Jul2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
Sculpture of Native Americanమా పాటలలో పదాలు వుట్టి పదాలు కాదు. అవి పవిత్రమైన పెయూట్ వేరు ప్రతిధ్వనులు. మా నేలలోని గులకరాళ్ల మర్మర ధ్వనులు. పెయూట్ విసన కర్రలోని మ్యాగ్ పీ, సిజర్ టెయిల్ పక్షుల ఈకల స్వరాలు. మా నీటి వాద్యం లోపల్నించి పలికే గొంతులు. పెయూట్ మొక్క మాకు గొంతు ఇస్తుంది. మేము పరస్పరం అర్థం చేసుకోడానికి పాటను ఇస్తుంది.
మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
May2008
ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
(ప్రాణహిత ఏప్రిల్ 2008 సంచిక తరువాయి)
శాంత మహాసముద్రం తన అనంత సహనంతో సాధించలేకపోయిన మార్పులను ఆ చిన్న, ముద్దొచ్చే శాన్ ఆంటోనియో పోస్టాఫీసు తీసుకొచ్చింది. మారియో హిమేనెజ్ ప్రతిరోజూ పొద్దుపొడవకుండానే లేవడం మొదలుపెట్టాడు. లేచీలేవగానే హుషారుగా ఈలలు వేయడం కూడ మొదలుపెట్టాడు. ఇదివరకు లేచీలేవడంతోనే బాధించే ముక్కు దిబ్బడ ఇప్పుడు లేదు. తన ఉద్యోగబాధ్యతలను చాల కచ్చితంగా నెరవేర్చడం మొదలుపెట్టాడు. మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
May2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
తెల్లవాడికి వాస్తవికత అంటే బ్యాంకులు, అంగళ్లు, నియాన్ లైట్లు, ట్రాఫిక్ తో నిండి వున్న వీధులు; ఎటు చూస్తే అటు పోలీసులు, ఒళ్లమ్ముకునేవాళ్లు, దిగులు మొహాల మనుషులు, అందరూ గడియారం ప్రకారం పనిచెయ్యడానికి తొందర పడుతూ వుండడం. కాని అదంతా అవాస్తవం. నిజమైన వాస్తవికత వీటన్నిటి అడుగున వుంటుంది. దాన్ని కనుక్కోవడానికి పెయూట్ తాత సహాయపడతాడు.
- క్రౌ డాగ్ మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
Apr2008
ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
కావడానికి అవి అంత ప్రాముఖ్యం లేని సంగతులే గాని వాటి ఫలితంగా మారియో హిమేనెజ్ జీవితం కొత్త పుంతలు తొక్కింది. అదృష్టం కొద్దీ ఆ పరిస్థితులవల్లనే జూన్ 1969లోమారియో కొత్త ఉద్యోగంలో కుదురుకోవలసి వచ్చింది.
మారియోకు చేపలుపట్టడం అంటే మాచెడ్డ చిరాకు. నిజం చెప్పాలంటే తెల్లవారకముందే పక్కమీదినుంచి లేవడమంటే మరీ చిరాకు. అవును గదా, తెలతెలవారేటప్పుడు నిద్ర ఎంత మజాగా ఉంటుంది! అప్పుడేగదా శాన్ ఆంటోనియో మూవీ థియేటర్ లో తెరమీద కనబడి కళ్లు జిగేలుమనిపించే అమ్మాయిలతో ఎన్నెన్నో సాహసకార్యాలు చేస్తున్నట్టు కలలు కనొచ్చు. మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
Apr2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
1972 వేసవి చివరలో రోజ్ బడ్ లో సూర్యనృత్యం (సన్ డాన్స్) నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎ.ఐ.ఎమ్. లీడర్లు చాలా మంది సూర్యనృత్యంలో పాల్గొనడానికి క్రౌడాగ్ దగ్గరికి వచ్చారు. పవిత్ర పొగ గొట్టంతో ప్రార్థనలు చేస్తూ, గద్ద ఎముకతో చేసిన ఈల వూదుతూ, సూర్యుడి వైపు చూస్తూ, ఆచారం ప్రకారం తమకు తాము నొప్పి కలిగించుకుంటూ మా జాతి చాల పవిత్రం అని భావించే సూర్య నృత్యంలో మమేకమయి పాల్గొన్నారు అందరూ. మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
Next »