సూచిక: 'ప్రత్యేక వ్యాసాలు'

యుద్ధ చిత్రాల ఎన్‌సైక్లోపీడియా – ఎనిమీ ఎట్ ది గేట్స్

ఒకే ఒక్క తూటా చరిత్రనే మార్చివేస్తుంది.
(A single bullet can change history.)

ఇదీ.. ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’ అనే సినిమా మనకు చెప్పే యుద్ధ సూత్రం. దీన్ని తెలుగులో మక్కీకి మక్కీగా చెప్పాలంటే ‘ముంగిట్లో శత్రువు’ అని అనువదించవచ్చు. రెండో ప్రవంచ యుద్ధ చరిత్రను మలుపు తిప్పిన చారిత్రక యుద్ద ఘటనల్లో ఒకటి స్టాలిన్‌గ్రాడ్ ముట్టడి. నాటి సోవియట్ అధినేత స్టాలిన్ పేరుమీద నిర్మించబడ్డ ఈ నగరంపై హిట్లర్ సైన్యం జరిపిన భీకర దాడి, రెండు మహా శక్తివంతమైన దేశాల ఆత్మగౌరవ పరిరక్షణకు నాంది పలికింది. స్టాలిన్ గ్రాడ్ నగరం ఇప్పడు ఓల్గా గ్రాడ్ అనే పాత పేరు తగిలించుకుంది. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు

మహాప్రస్థానం అంకితం కొంపెల్ల జనార్దనరావు కోసం మాత్రమేనా?

బరంపురంలో మనం ఇంకా
నిన్న గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును
కలకల లాడించింది నీ నవ్వు…
విశాఖపట్టణం వీథుల్లో మనం
‘ఉదయిని’ సంచికలు పట్టుకు తిరగడం
జ్ఞాపకం ఉందా? మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

చైతన్యం గురించి

‘దేవుడెక్కడున్నాడో చూపించ’మని అడిగే అవివేకపు భౌతికవాదులకు సమాధానం చెప్పే భక్తులందరూ తమ మనసుల్లోకి తొంగిచూసుకోమని చెపుతారు. అంటే అది మన చైతన్యంమీదనే ఆధారపడుతుందన్నమాట. చైతన్యమంటే ఏమిటి? దేవుడి సంగతి ఎలా ఉన్నా అది మన పరిసరాల గురించిన అవగాహన కల్పిస్తుంది. అయితే మరికొన్ని విషయాలుకూడా ఉన్నాయి. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు

వక్త్‌ కీ ఆవాజ్‌

సలాం హైదరాబాద్‌ లోకేశ్వర్‌ ఆత్మచరిత్రాత్మక నవల. తెలంగాణ నవల అన్నాడు గానీ ఇది చార్మినార్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. హైదరాబాద్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. 1969లో ప్రత్యేక తెలంగాణ పోరాట ఉద్యమానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌ అరుదయిన చరిత్ర, అణచివేయబడిన పోరాట చరిత్ర రాసాడు గనుక తెలంగాణ హైదరాబాద్‌ అద్దంలో తన ప్రతిఫలనం చూసుకున్న నవల. అద్దంలో ప్రతిబింబం తప్ప ప్రతిఫలనం కనిపించదు కదా. అందుకే ఈ నవల అద్దం కాదు. హైదరాబాద్‌ చుట్టూ, స్వామిని, వేణును, హైదరాబాద్‌ను, సికిందరాబాద్‌ను కలిపిన హుసేన్‌సాగర్‌ అలల్లో తమ స్నేహాలను, స్వప్నాలను చూసుకున్న నవల.
స్వామిని, వేణును కలపడమంటే తెలంగాణను శ్రీకాకుళాన్ని కలపడం కూడ. స్వామి దగ్గర బయల్దేరి వేణు దగ్గరికి చేరుతామా, వేణు శ్రీకాకుళ ఉద్యమంలోకి వెళ్లిన ఉత్తరం చదువుకుందామా – శ్రీకాకుళం తెలంగాణకు నడచివచ్చిన, కాదు తూర్పుగాలియో, సముద్ర కెరటమో సుడిగాలివలె, తుపాను వలె నాలుగు దిక్కుల చుట్టివచ్చిన ఉదంతం చదువుకుందామా. తుర్రెబాజ్‌ఖాన్‌, అల్లావుద్దీన్‌ల అమరత్వంతో ఆరంభమై ఈ నవల నడుస్తున్న చరిత్రలోని నలభై ఏళ్ల కింద అధ్యాయం దగ్గర ఆగినట్లు (ముగిసినట్లు కాదు) వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంల అమరత్వంతో సెట్‌ బ్యాక్‌కు గురయి అసంపూర్ణంగా ముగిసిన ప్రజాస్వామిక విప్లవ చరిత్ర చదువుకుందామా. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు, ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

రైతు రాజయ్యే రోజొకటుందా?

వ్యవసాయం మానవ జీవిత చరిత్రలోనే సాటిలేని ఒక అద్భుతం.
చరిత్రలో మొట్టమెదటి సృజనాత్మక కళాకారుడు రైతే.
మట్టిని బంగారంగా మార్చే సువర్ణ విద్య తెలిసిన ఆల్ కెమిస్ట్ రైతు. దిగంతాల మధ్య ఆకాశమే కప్పుగా పచ్చదనాల మట్టితోటిదే రైతు జీవితం…. వ్యవసాయం చుట్టూ అల్లుకున్న మానవ జీవితమే ఒక గొప్ప సంస్కృతి అంటారు కుటుంబరావు గారో చోట…….. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

పొటెంకిన్‌లో ఆ రోజు ఏం జరిగింది?

పొటెంకిన్‌ తిరుగుబాటులో చివరి వ్యక్తితో భేటీ!

1905లో రష్యాలో జారిస్టు యుద్దనౌక పొటెంకిన్‌లో జరిగిన తిరుగుబాటు కేవలం యాదృచ్ఛిక ఘటన కాదు.రష్యా మొత్తంలో చెలరేగిన తిరుగుబాట్లకు అదొక తిరుగులేని  సంకేతం. దేశవ్యాప్తంగా జరిగిన ఈ తిరుగుబాట్లలో 1905లోనే దాదాపు 3వేలమంది ప్రజలు చంపబడ్డారు. అది రష్యా పాలకుడు జార్ నికోలస్ పాలన కుప్పగూలడానికి సిద్ధంగా ఉన్న కాలం. తర్వాత బయటపడినట్లుగా తిరుగుబాటుదారులు అల్లిన ఓ ఉమ్మడి ప్రణాళిక ప్రకారం, నావికాబలగాల్లో విస్తరించిన తిరుగుబాటుదారులు నల్లసముద్రం పొడవునా ఉన్న ఓడరేవులను దిగ్భంధించాలి. ఈలోగా రష్యా భూభాగంలోని విప్లవకారులు తిరుగుబాటు జ్వాలలను ప్రేరేపించాలి. కాని ఈ పథకం పనిచేయలేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే పొటెంకిన్‌లో పితూరీకి దారితీశాయి. మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, వీడియో / ఆడియో

నేనెరిగిన శ్రీశ్రీ

మద్రాసులో పుట్టిపెరగడంవల్లనూ, మా ఇంట్లోని తెలుగు సాహిత్యవాతావరణంవల్లనూ శ్రీశ్రీగారిని నేను చాలాసార్లు, చాలా సందర్భాల్లో చూశాను. మా కుటుంబానికి అనేక తెలుగు స్థానికరచయితల, కళాకారుల కుటుంబాలతో పరిచయాలుండేవి. వీరిలో శ్రీశ్రీ ధోరణి కాస్త వేరుగా ఉండేది. ఆయనకు మా అమ్మకూడా చాలా ఏళ్ళుగా తెలిసినప్పటికీ ఆయన సంభాషణా, సంపర్కమూ మానాన్నవరకే పరిమితంగా ఉండేది. తన కుటుంబాన్ని పరిచయం చెయ్యడంగాని, మా కుటుంబసభ్యులతో మామూలుగానైనా మాట్లాడడంగాని ఆయన చేసేవారుకాదు. మొత్తం చదవండి »

38 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

కళాకృతులూ, డైనొసార్లూ

వివిధ నాగరికతలు మొదలైన కొన్నివేల ఏళ్ళ క్రితం వాటిని ప్రతిబింబించే తాత్వికచింతనలూ, కళల చిహ్నాలూకూడా రూపొంది, ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వీటిలో కొన్ని సరిగా అర్థంకావు. ఉదాహరణకు మనదేశంలో వీణ తదితర సంగీతవాద్యాలలోనూ, కొన్ని దేవాలయశిల్పాలలోనూ ‘యాళి’ ముఖాలు కనిపిస్తాయి. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్

ఆంతరంగికం

కారణమేదీ లేకుండానే కలిగే దుఃఖం

ఆవరణలో అది పొగమంచో లేకుంటే అలుముకున్న మేఘమో
చెరిపేస్తే చెరగదు  ఆపేస్తే ఆగదు మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు, ప్రత్యేక వ్యాసాలు

ఓడి గెలిచిన యోధానుయోధుడు: స్పార్టకస్

సమకాలీన ప్రపంచంలో పరిచయం అవసరం లేని వాళ్లలో ఒకరి పేరు సూచించండి. నాకయితే వెంటనే గుర్తుకొచ్చే పేరు చేగువేరా. అలాగే ప్రాచీన ప్రపంచంలో పరిచయం అవసరం లేని వాళ్లలో ఒకరి పేరు సూచించమంటే నా మనస్సులో మెదిలే తొలి పేరు స్పార్టకస్. మొత్తం చదవండి »

9 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు

ఆదర్శాలు, విలువలు – ప్రజల పట్ల బాధ్యత – బాల గోపాల్ జీవితం

బాలగోపాల్ ను పునర్నిర్మాణం చేయడం ఇంత తొందరలో సాధ్యం కాకపోవచ్చు.కాని ఆయన సమాజం మీద వేసిన ప్రభావం వల్ల ఆయన వ్యక్తిత్వ విశ్లేషణ జరగాల్సే వున్నది. ఆ క్రమంలో ఆయన ఆలోచనలను, ముఖ్యంగా ప్రజాస్వామిక సంస్కృతిని రూపొందించడానికి ఆయన ప్రతిపాదించిన ప్రాపంచిక దృక్పధాన్ని , విలువలను అంచనా కట్టాల్సే వున్నది ముందుగా అందుకోసం మనకుండే ఆకరాలు, పనిముట్లు , సమాచారం -  విడివిడిగా శకలాలుగా, ఙ్ఞాపకాలుగా , అనుభవాలుగా , ఆచరణగా ఉన్నవన్నీ ఒకచోట సమకూర్చుకోవాలి లేకపోతే అర్థసత్యం చెప్పినన వాళ్ళం, అరకొరగా తెలుసుకున్న వాళ్ళమే అవుతాం. అందువల్ల ఇపుడెట్లాగూ ఆయన కొచ్చే నష్టమేమీలేదు. బతికుండగానే ఆయన పొగడ్తలకు,నిందలకు దూరంగా ఉన్నాడు. అయితే అది మన సత్యాన్వేషణకే అవరోధమవుతుంది గనుక అధిగమించాలి. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు

బాలగోపాల్ ఙ్ఞాపకాలు

2009 అక్టోబర్ 8, రాత్రి  పదిన్నర , బాలగోపాల్ ఆరోగ్యం బాగాలేదు అన్న వార్త టి.విలో చూడటానికి, ఆయన మనకిక  లేడన్న వార్త వినటానికి మధ్య ఎడంలేదు. బాలగోపాల్ మరణాన్ని తట్టుకోలేక , చెప్పలేక పెద్దపెట్టున ఏడ్చేసిన నామిత్రుడు పొరుగింటి బుర్రారాములు దుఃఖం లో నేను కూడా………. మానవహక్కుల ఉద్యమపుకాడిని రాములు ఒక్కడి భుజం మీద వదిలేసి బాలగోపాల్ ఎందుకలా వెళ్ళిపోవలసి వచ్చిందని ఎవరి మీదో తెలియని ఏదోకోపం………….. అక్రోశం……………… మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సంస్మరణ

మతాల చరిత్ర

మతాల్లో నమ్మకం ఉండడం పూర్తిగా వ్యక్తిగతమైన విషయమని అనుకుంటాం. దేవుణ్ణి నమ్మమని ఎవరూ మనని నిర్బంధపెట్టరు కనక అది స్వచ్ఛందంగా ఆమోదించిన విషయంలాగా అనిపిస్తుంది. ఇది ఏ మాత్రమూ నిజంకాదు. ప్రత్యక్షంగా కాకపోయినా చుట్టూ ఉన్న సమాజమూ, సంస్కృతీ దేవుడున్నాడనే విషయాన్ని నిత్యమూ మనకు గుర్తుచేస్తూనే ఉండే అవకాశముంది. ఒకప్పుడు సమష్టి ప్రయోజనాలకు పనికొచ్చిన మతవిశ్వాసాలు తరవాతి దశల్లో మనుషులను ఏకాకులను చేశాయి. ఇదొక సామాజికపరిణామం. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు

నరేన్ … నరేన్….

- మునికిష్ణ

అది 1990ల ప్రాంతం. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాలనుంచి పలమనేరు బంగారుపాళ్యం మండలాలలోకి ఏనుగులు చొచ్చుకొని వచ్చి అటవీ ప్రాంతపు పొలాలపై దాడులు చేయసాగింది.ఈ సమస్య పై అన్ని దిన పత్రికలు వార్తలు ప్రచురించాయి.ఏనుగుల సమస్యపై అప్పటికీ మా చిత్తూరు జిల్లా పౌరహక్కుల సంఘం యూనిట్ ఏనుగుల రాజ్యం అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించి వుంది. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సంస్మరణ

మా నాన్న కుటుంబజీవితం

Kodavatiganti Kutumba Rao
Kodavatiganti Kutumba Rao
అక్టోబర్ 28న మా నాన్న కుటుంబరావుగారు పుట్టి నూరేళ్ళవుతాయి. సాహిత్యంలోనూ, కళల్లోనూ కృషి చేసినవారి కుటుంబనేపథ్యం, పెరిగిన వాతావరణం ఎటువంటివో తెలిస్తే వారి గురించిన అవగాహన పెరగవచ్చు. ఇది కేవలం వారి వ్యక్తిగతజీవితం గురించిన ఆసక్తి అనిపించుకోదు. సమాజానికీ, వ్యక్తిత్వానికీమధ్య జరిగే ప్రక్రియలను సూచిస్తుంది. మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

గుర్తుండని బాల్య స్మృతులు

ఏదైనా నేర్చుకోవడానికి చిన్నతనమే తగిన వయస్సనిపిస్తుంది. మనదేశపు సంప్రదాయంలో ముందు ప్రతిదాన్నీ మంత్రాల్లాగా “భట్టీయం” వేయించడం పరిపాటి. ఆ దశలో ఏం నేర్పుతున్నారో ఏమీ అర్థంకాదు. ఆ పద్ధతిలో కంఠతాపట్టినది మరిచిపోము కనక నేర్చుకున్నదేమిటో ఆ తరవాత సావకాశంగా అర్థమౌతుంది. చిన్నప్పుడు మన మెదడుకు మైనంలా రూపాన్ని మార్చుకోగల మైశీల గుణం ఉంటుంది కనకనే చదువూ, రకరకాల నైపుణ్యమూ చిన్నతనంలోనే త్వరగా అబ్బుతాయి. ఇక్కడ “చిన్నతనం” అంటే అయిదారేళ్ళ వయసు అని అర్థం; అంతకు మునుపటి విషయాలు గుర్తుండవనేది తెలిసినదే. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్

మతిమరుపు

ఏదైనా సమయానికి గుర్తుకు రాకపోతే చిరాకుగా అనిపిస్తుంది. అదేగనక ఏ పరీక్ష రాస్తున్నప్పుడో, ప్రేక్షకుల ఎదుట నాటకంలో నటిస్తున్నప్పుడో, ప్రసంగిస్తున్నప్పుడో జరిగితే మరీ కంగారుగా ఉంటుంది. ఉన్న కాస్త మతీకూడా పోయినట్టనిపించడంతో మరిన్ని పొరబాట్లు చేస్తాం. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్

Next »