సూచిక: 'సైన్స్'
Feb2010
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
వివిధ నాగరికతలు మొదలైన కొన్నివేల ఏళ్ళ క్రితం వాటిని ప్రతిబింబించే తాత్వికచింతనలూ, కళల చిహ్నాలూకూడా రూపొంది, ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వీటిలో కొన్ని సరిగా అర్థంకావు. ఉదాహరణకు మనదేశంలో వీణ తదితర సంగీతవాద్యాలలోనూ, కొన్ని దేవాలయశిల్పాలలోనూ ‘యాళి’ ముఖాలు కనిపిస్తాయి. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Sep2009
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఏదైనా నేర్చుకోవడానికి చిన్నతనమే తగిన వయస్సనిపిస్తుంది. మనదేశపు సంప్రదాయంలో ముందు ప్రతిదాన్నీ మంత్రాల్లాగా “భట్టీయం” వేయించడం పరిపాటి. ఆ దశలో ఏం నేర్పుతున్నారో ఏమీ అర్థంకాదు. ఆ పద్ధతిలో కంఠతాపట్టినది మరిచిపోము కనక నేర్చుకున్నదేమిటో ఆ తరవాత సావకాశంగా అర్థమౌతుంది. చిన్నప్పుడు మన మెదడుకు మైనంలా రూపాన్ని మార్చుకోగల మైశీల గుణం ఉంటుంది కనకనే చదువూ, రకరకాల నైపుణ్యమూ చిన్నతనంలోనే త్వరగా అబ్బుతాయి. ఇక్కడ “చిన్నతనం” అంటే అయిదారేళ్ళ వయసు అని అర్థం; అంతకు మునుపటి విషయాలు గుర్తుండవనేది తెలిసినదే. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Aug2009
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఏదైనా సమయానికి గుర్తుకు రాకపోతే చిరాకుగా అనిపిస్తుంది. అదేగనక ఏ పరీక్ష రాస్తున్నప్పుడో, ప్రేక్షకుల ఎదుట నాటకంలో నటిస్తున్నప్పుడో, ప్రసంగిస్తున్నప్పుడో జరిగితే మరీ కంగారుగా ఉంటుంది. ఉన్న కాస్త మతీకూడా పోయినట్టనిపించడంతో మరిన్ని పొరబాట్లు చేస్తాం. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Jul2009
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మా నాన్నకు చిన్నతనంనుంచీ సైన్సులో ఆసక్తి ఉండి ఉండాలి. ఈ రోజుల్లో ముంబయివంటి పెద్ద నగరాల్లోకూడా లేని కొన్ని సదుపాయాలు ఆయనకు చిన్నతనంలో తెనాలి స్కూళ్ళలో లభించాయి. ఫ్రెంచ్‌లో జూల్‌వెర్న్, ఇంగ్లీషులో ఎచ్.జి.వెల్స్ గొప్ప సైన్స్ ఫిక్షన్ రచనలు చేశారు. అవన్నీ ఇంగ్లీషు పత్రికలద్వారా మానాన్నకు స్కూలురోజుల్లోనే అందుబాటులో ఉండేవి. మనోవికాసం పొందటానికి తహతహలాడుతున్న ఆ దశలో ఇవన్నీ ఆయనను ప్రభావితం చేసి ఉంటాయి. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
May2009
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రతివారికీ తమ చిన్నప్పటి సంగతులు కొన్నయినా గుర్తుంటాయి; బాల్యస్మృతులన్నీ గడిచిపోయిన కాలానికీ, సంఘటనలకూ, అనుభవాలకూ ఆనవాళ్ళుగా మనసులో నిలిచిపోతాయి. అయితే ఇవన్నీ సామాన్యంగా మూడేళ్ళ ప్రాయంనుంచీ మొదలవుతాయి; అంతకు మునుపటి సంగతులు మనకు గుర్తుండటం చాలా అరుదైన విషయం. ఆ తరవాతివైనా ఏడేళ్ళ వయసు వచ్చినదాకా అక్కడా ఇక్కడా స్మృతుల శకలాల రూపంలోనే మనసులో మెదులుతాయే తప్ప పూర్తిగా గుర్తుండవు. ఇలా ఎందుకు జరుగుతుంది? మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Apr2009
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రస్తుతపు సమాచార యుగంలో లెక్కలేనన్ని విషయాలను మనకు క్షణంలో గుర్తుచేసేందుకు ఎన్నో సాధనాలున్నాయి. ఉదాహరణకు టెలిఫోన్ నంబర్లనూ, ఈమెయిల్ అడ్రసులనూ కంఠతా పట్టనవసరం లేకుండా పని జరుపుకునేందుకు సదుపాయాలున్నాయి. పొద్దున్నే అలారం మోగినట్టుగా ప్రతిరోజూ చెయ్యవలసిన పనులనూ, హాజరు కావలసిన సమావేశాలనూ, సంవత్సరం పొడుగునా బంధు మిత్రుల పుట్టిన తేదీలనూ, ఇతర సందర్భాలనూ సమయానికి మనకు గుర్తు చేసేందుకు పరికరా లున్నాయి. విద్యార్థులకు రెండురెళ్ళు నాలుగన్నదికూడా గుర్తుండనవసరం లేదు; కాల్‌క్యులేట ర్లున్నాయి. ఈ పరిస్థితులలో మనకు జ్ఞ్ఞాపకశక్తి అవసరమా అనిపిస్తుంది. అయితే అనేక సందర్భాల్లో ఇప్పటికీ మనకు జ్ఞ్ఞాపకశక్తి లేకుండా జరగదు. అందుచేత దాని వివరాలు తెలుసుకోవడం ముఖ్యమే. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Mar2009
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనిషి మెదడుకు ఉండే అనేక అద్భుత శక్తుల్లో సమాచారాన్ని పొందుపరుచుకోగలగడం ఒకటి. మన ఘనాపాఠీలు ఎన్నెన్నో వేదమంత్రాలను ఏకరువు పెట్టగలరు. టర్కీలోని ఒక వ్యక్తి 6 గంటలపాటు కురాన్‌లోని 6666 సూక్తులను అనర్గళంగా వల్లించగలడు. మంగళూరుకు చెందిన రాజన్ మహాదేవన్ గణితంలో 3.14… అని అనంతంగా సాగిపోయే “పై” సంఖ్యను 31,811 స్థానాల వరకూ ఖచ్చితంగా చెప్పగలడు. ఇంతగా కాకపోయినా మనంకూడా రోజువారీగా బోలెడన్ని విషయాలను గుర్తుపెట్టుకో గలం. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Feb2009
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
భౌతికవాదాన్నీ, హేతువాదాన్నీ సమర్థించేవారు విజ్ఞాన విషయాలను తేలికభాషలో అర్థం చేసుకోవడం మంచిదేనని అంగీకరిస్తారు. ఇది నిజమే అయినప్పటికీ ఒకరకంగా చూస్తే వైజ్ఞానిక దృక్పథం అవలంబించడం, సైన్సుపట్ల ఆసక్తి ఉండడం వగైరాలు ఒక ఎత్తూ, నడుం బిగించి సైన్సు వివరాల్లోకి దిగడం మరొక ఎత్తూ అనిపించవచ్చు. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Jan2009
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనిషి మెదడును చురుకుగా ఉంచుకోవటానికి పనికొచ్చే కొన్ని పద్ధతులను గురించి పరిశోధకులు చెపుతూ ఉంటారు. వీటిని ఎవరైనా, ఎప్పుడైనా సులువుగా చేసుకోవచ్చు. బట్టలు వేసుకుంటు న్నప్పుడూ, తల రుద్దుకుంటున్నప్పుడూ కళ్ళు మూసుకోవడం, భోజనం దగ్గర మాట్లాడకుండా సైగలు మాత్రమే చెయ్యడం, ఎక్కడికయినా వెళ్ళేటప్పుడు కొత్తదారి వెతుక్కోవడం మొదలైనవన్నీ మెదడుకు చిన్నచిన్న కసరత్తుల్లా పనిచేస్తాయి. రెండేసి పనులు ఒకేసారిగా చేస్తే అదీ ఒక మానసిక వ్యాయామమే; సంగీతం వింటూ పువ్వులను వాసనచూడడం, మబ్బులను గమనిస్తూ బొమ్మలు చెక్కడం మొదలైనవి మెదడుకు కొత్తరకం సవాళ్ళుగా అనిపిస్తాయి. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Nov2008
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనసు, చైతన్యం, స్పృహ మొదలైన పెద్ద పెద్ద భావాలన్నీ ప్రధానంగా మన ఇంద్రియాలు బాహ్య ప్రేరణలకు స్పందించడం మీదనే ఆధారపడతాయి. మనకున్న ఇంద్రియ శక్తులు పూర్తి స్థాయిలో పుట్టుకతోనే వచ్చినవి కావు. అవి మెదడుతో బాటే ఎదుగుతాయి. మెదడు ఎలా వికాసం చెందుతుందో తెలుసుకోవాలంటే పసితనంనుంచీ ఎటువంటి మార్పులు కలుగుతాయో గమనించాలి. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Oct2008
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనుషులవంటి ప్రాణులన్నీ నాడుల పుట్టలవంటివే. మనుషులు అనుక్షణమూ ప్రేరణలూ, స్పందనలకు లోనవుతూ, శారీరక సుఖాలనూ, కష్టాలనూ రకరకాలుగా అనుభవిస్తూ, వర్ణిస్తూ జీవితాలు గడుపుతారు. మన ఆలోచనాస్రవంతిలో భాగాలైన మనస్తత్వ విశ్లేషణలూ, తత్వధోరణీ, ఊహపోహలూ అన్నీ ఈ భావనలమీదనే ఆధారపడతాయి. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Jul2008
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మన జీవితాలన్నీ ఆలోచనల, భావాలమయమైనవి. ఆధునిక జీవితపు ఒత్తిడి వల్ల చాలామంది మానసికంగా కుంగిపోవడం, డిప్రెషన్ వంటివాటికి మందులు వేసుకోవడం మామూలైంది. ఈ మందులన్నీ రసాయనికపదార్థాలే. మన మెదళ్ళలోనూ, నాడుల మధ్యనా విడుదల అయే రసాయనాలమీద ఇవి పనిచేస్తాయి. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Apr2008
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రాణులకు తమ పరిసరాలను గురించి ఉండే స్పృహా, చైతన్యమూ ఎంతో ప్రత్యేకమైనవి. అవి లేనిదంతా “జడ” పదార్థమే. ముఖ్యంగా మనుషుల్లో “ఒళ్ళు తెలియకుండా పోవడం” చాలా అసహజమైనదిగా భావిస్తాం. ఎంత ప్రాథమిక జీవి అయినా బతికున్నంత కాలమూ తన చుట్టూ ఉన్న పరిస్థితులను గుర్తించి, వాటికి స్పందిస్తుంది. అయితే ఈ స్పందనల్లో తేడాలుంటాయి. ఏకకణజీవులైన అమీబా వంటివి ఎక్కువ “తెలివితేటలను” పొందలేవు. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Mar2008
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనుషులతోబాటు కనబడేవీ, కనబడనంత సూక్ష్మమైనవీ ఎన్నెన్నో ప్రాణులు సహజీవనం చేస్తున్నాయి. అయితే ఇటువంటివి భూగ్రహానికి వెలపల ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఇంతవరకూ జరిగిన జీవపరిణామంలో మనలాగా బుద్ధిజీవితానికి అలవాటుపడ్డ మరే ప్రాణీ కనబడదు. ఇటువంటి పరిణామానికి మూలకారణమైన మనిషి మెదడు ప్రాణికోటిలోనే ఎంతో ప్రత్యేకమైనది. మన పాలపుంత గేలక్సీలోని తక్కిన ప్రాంతాలమాట ఏమోగాని, మనకు తెలిసినంతవరకూ దీన్ని పోలినది మన సౌరవ్యవస్థలో కనబడదు.
మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Feb2008
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులూ మన జీవితాలని ఎన్ని రకాలుగా ప్రభావితం చెయ్యగలవో పూర్తిగా అర్థం కావటంలేదు. పరిశోధనల్లో బైటపడుతున్న కొత్త విషయాల్లో వాటి గురించిన మంచీ, చెడూ కూడా తెలియవస్తోంది. ఒక్కటి మాత్రం నిజం. ప్రపంచంలో ప్రతిచోటా నిలదొక్కుకుని జీవిస్తున్న రకరకాల బాక్టీరియాను తప్పించుకోవడం అసాధ్యమైన పని. పనికిరాని చెత్తనూ, కుళ్ళిన జీవ పదార్థాలనూ ఎప్పటికప్పుడు విడగొట్టి మట్టిలో కలిపేసే బాక్టీరియా మనకు పనికొచ్చే ఆహారాన్ని కూడా “పాడు” చేస్తూ ఉంటాయి. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Jan2008
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రకృతిలో రోగాల బారినపడని ప్రాణి ఏదీ ఉండదు. బాక్టీరియాకూడా జీవరాశిలో భాగమే కనక ఇది వాటికీ తప్పదు. పీత కష్టాలు పీతవి అన్నట్టుగా వీటిని వెంటాడేవికూడా లేకపోలేదు. దీనికర్థం ఏమిటంటే మనకు కనబడని రోగక్రిముల్లో బాక్టీరియాకాక మరికొన్నికూడా ఉన్నాయని. వాటివల్ల బాక్టీరియాకు రోగాలు వచ్చినట్టే మనకు కూడా జబ్బులు పట్టుకుంటూ ఉంటాయి. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Dec2007
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులూ అనేవి అసలు ఉన్నాయని తెలియడానికి భౌతికశాస్త్రంలో కొంత ప్రగతి అవసరమైంది. రకరకాల కటకాలతో మైక్రోస్కోప్‌లు తయారైన తరవాతనే సంగతులన్నీ బైటపడసాగాయి.
ఆధ్యాత్మిక ధోరణి ఉన్నవారు మానవమాత్రులను ఆడించే శక్తిని గురించి తలుచుకుంటూ ఉంటారు. ఎవరి కంటికీ కనబడని ఆ శక్తి ఏమిటో ఎవరికీ అంతుచిక్కదు గాని సైన్సుకు తెలిసినంతవరకూ అటువంటి శక్తేదో బాక్టీరియాకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Next »