Oct2010
శుద్ధి
ఎప్పుడో ఐదుంబావుకే వరంగల్లు స్టేషన్ కి రావాల్సిన సింగరేణి ప్యాసింజర్ ఏడుగంట లవుతున్నా రాకపోవడంతో నాలుగున్నరకే వచ్చి కూర్చున్న మాకు భరించలేనంత విసుగ్గా ఉంది. మొత్తం చదవండి »
ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక
Oct2010
ఎప్పుడో ఐదుంబావుకే వరంగల్లు స్టేషన్ కి రావాల్సిన సింగరేణి ప్యాసింజర్ ఏడుగంట లవుతున్నా రాకపోవడంతో నాలుగున్నరకే వచ్చి కూర్చున్న మాకు భరించలేనంత విసుగ్గా ఉంది. మొత్తం చదవండి »
Oct2010
నర్శింలు బిడ్డ పెండ్లి.
కాలేదు….. పెట్టుకుంటరు.
వాళ్ళు వచ్చి పిల్లను చూసిపోయిండ్రు. నచ్చిందని చెప్పి పంపిండ్రు. నర్శింలుకు ఇష్టమే లేదు. వీళ్ళు పోయి పిల్లగాన్ని చూసి వచిండ్రు. పిల్లగడు నచ్చిండు. పెండ్లి చెయ్యాలనుకున్నరు. అలాలిసకు డేటుకూడా అనుకున్నారు. నర్శింలుతో పని లేకుండా అంతా జరిగిపోయింది.
అప్పుడు మొదలైంది నర్శింలుకు వణుకుడు. ఎట్ల…ఎట్ల…? ఏం జెయ్యాలె…? ఎట్ల నడువాలె…? అనుకుంటుండు. భయపడుతుండు. తొక్కులాడుతుండు. రంది మొదలయింది. మొత్తం చదవండి »
Oct2010
”చూడటానికలా వుంటుంది కానీ అమ్మో ! నెరజాణండీ అది” అన్న సరోజ మాటలు మరోసారి గుర్తొచ్చాయి ఆ అమ్మాయిని చూస్తుంటే.
ఆరోగ్యంగా కళగా వున్న మొహం. ఆమొహంలో ఏదో అర్ధం కాని భావం. దిగులా ! భయమా ! అసహ్యమా ! నిర్వేదమా !
ఈ మహిళా సంరక్షణ కేంద్రం అయిదేళ్ళుగా నడుపుతున్నాను నేను. ఈవూరే కాక చుట్టుప్రక్కల పల్లెటూర్ల నుంచి కూడా ఎందరో ఆడవాళ్ళు వస్తుంటారిక్కడికి.
రకరకాల సమస్యలతో వచ్చిన ఆడవాళ్ళని చూశాను నేను. తమకి అన్యాయం చేసిన వాళ్ళపై దుమ్మెత్తి పోసేవాళ్ళనీ, శాపనార్ధాలు పెట్టేవాళ్ళనీ, ఏడ్చి పెడబొబ్బలు పెట్టే వాళ్ళనీ, ఆపకుండా రాగాలు తీసేవాళ్ళనీ… మొత్తం చదవండి »
Oct2010
ట్రింగ్……ట్రింగ్….ట్రింగ్…
అలారం మోగుతున్నా తన చెవి పక్కనే లెమ్మని సొదపెడుతున్నా కార్తీక్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని నీలిమ అలారం తలపై ఠపీమని అరచేతితో చిన్న దెబ్బ వేసింది.
ఆ దెబ్బకి అలారం ఆగిపోయినా గడియారం దభీమని కింద పడింది. మొత్తం చదవండి »
Oct2010
తెల్లవారింది, వర్షం అలాగే పడుతోంది. ఆగి ఆగి కొంతసేపు, గాలి వీస్తు మరికొంత సేపు, కుండపోతగా మరికొంతసేపు కురుస్తూనే వుంది. రెండురోజుల క్రితం మొదలైన వాన, ఇంపూ తెంపూ లేకుండా కురుస్తూనే వుంది. మొత్తం చదవండి »
Oct2010
గస పోసుకుంటూ రోడ్డు పొంటి దబ్బదబ్బ నడుస్తున్నది వెలుగమ్మ.పెయ్యంతా చెమటతోని తానం చేసినట్ళట్లు అయ్యింది. ఆ డాక్టరమ్మ ఈపారన్న ఉంటదో ఉండదో, బిడ్డకు పొద్దులు. ఇగ ఏ నిమిసంలనన్న కనెటట్లె ఉన్నది. పీహెచ్సీ సెంటర్లగా కమల డాక్టారమ్మ ఉంటెగింటె బిడ్డకు దిలాస. లేకుంటే గా సిస్టరమ్మ గూడంగ మంచిగనే చేస్తది కాన్పు. గామె లేకుంటె ఊర్లె మంత్రసాని ఉండనే ఉన్నది ఏమొ ..మొన్నగా కుమ్మరోల్ల రాజయ్య బిడ్డకు మస్తు రక్తం పోయిందంట… గా పొల్లకు కుట్లెయ్యినీకి దవాఖానాకు కొంటబోయెటాల్లకు సచ్చేపోయిందంట. పెయిల రక్తం సానా పోయిందంట మల్ల గింత అయినంక తను జేపిత్తదా గా మంత్రాసానితోని? మొత్తం చదవండి »
Jun2010
కాలువ గట్టు మీద కూకుంది లచ్చుమమ్మ. లచ్చుమయ్య పారదీసుకొని కాలువ నీళ్ళను మడిలోకి మళ్ళిస్తుండు.దుడ్డెగాని లాకె గులక రాళ్ళ మీదినుంచి, నీటిలో మొలచిన గరక మీదినుంచి దుంకుతూ జోరుగా పరుగు లిడుతున్నది కాలువ.
ఆ పరుగు వంకర టింకరగా వుంది. చాలా స్వచ్ఛంగా వుంది. ప్రశాంతంగా వుంది.
Jun2010
అద్దం మూసిన కిటికీలోంచి మబ్బులు వెనక్కి జరగడం గమనించకపోతేగనక, విమానం ముందుకెళుతోందన్న సంగతే తెలియదేమో. చదువుతున్న పుస్తకంలోకి మళ్లీ తలదూర్చబుద్ధి కాలేదు. ఇటుపక్కకు చూస్తే సూటూబూటూ వేసుకున్న పెద్ద మనిషి ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటున్నాడు. దానికి బదులు అతను ఏ పుస్తకమో చదువుతుంటే ఈపాటికి అతన్ని కదిపి సంభాషణలో పడేసే మనిషినే నేను. అలా అనుకోగానే మనసులో ఆచార్య నేర్పించిన ఆట మెదిలింది. మా వయసుల్లోని తేడా మర్చిపోయి మరీ దాన్ని ఆడుతూ నవ్వుకునేవాళ్లం.
ఆచార్య… మొత్తం చదవండి »
Jun2010
ఆరవ తరగతి క్లాసు నిశ్సబ్దంగా వుంది.
అందరు శ్రద్ధగా వింటున్నారు.
పిల్లలు కొంచెం ముందుకు వంగి రెండు అరచేతులు రెండు చెంపలకు ఆన్చుకొని కళ్ళు కదపకుండా మేడాం కరిష్మా వైపే చూస్తున్నారు.
మొదటి రెండు వరుసల బెంచీల్లో తెల్లగా నాజూగ్గా వుండే పిల్లలు…….
చివర వరుసల్లో ఛామనఛాయ నలుపు రంగులో వుండే పిల్లలు………
అది గర్ల్స్ ఇంగ్లీషు మీడియం పైవేటు హైస్కూల్ ………… పర్సనాలిటీ డెవలప్ మెం ట్ క్లాస్.
వారంలో ఒకరోజు మాత్రమే.
ఆ క్లాసుకోసం పిల్లలందరూ వారమంతా వేచి చూస్తారు.
శుక్రవారం కావడం వల్ల పిల్లలందరూ అప్పుడే పూచిన రోజాల్లా ముద్దుగా వచ్చారు.
ఇదంతా ఒకఎత్తైతే…..
ఆ క్లాసుకు మేడం కరిష్మా ఒక ఎత్తు. మొత్తం చదవండి »
Jun2010
ప్రకృతికి ఉదయం అంటే ఇష్టమేమో…. ప్రశాంతంగా తనలోని అందాల్ని పలకరిస్తోంది…..మూగ జీవాల్ని పరశీలిస్తోంది…… పచ్చని చెట్లని హెచ్చరిస్తోంది….ఒక్క గంటాగితే తనకు ఇంతటి మౌనం దొరకదనేమో…. కాలాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని దాచుకుంటోంది…… తనివి తీరా అనుభవిస్తోంది….కోయిల తన కుహూ…కుహూ రావాలతో మనుషులు లేచేలోగా మనం మన పనిలో పడదామంటూ తన జాతిని మేల్కొలుపుతోంది. ఒక వేళ మేము ఆహార వేటకు వెళ్ళినపుడు మీకు నడక వస్తే బయటకు రావద్దని తల్లి పక్షులు పిల్ల పక్షులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. ఇలాప్రపంచంతో సంబంధంలేని ఈ మూగ జీవాలు తమ పనిలో తాము నిమగ్నమవుతున్నాయి… వీటికి ఆదివారాలు లేవు…వీటి పనికి సెలవు రోజులుండవు… నిరంతర పోరాటం వీటికి తెలిసిన విద్య… వాతావరణం ఇలావుండగా… మొత్తం చదవండి »
Jun2010
రాముడు నందికొట్కూరులో బయల్దేరే సరికి తెల్లారిపోయింది.
అక్కడికీ, కాస్త చీకట్లోనే నిద్ర లేచాడు.
రమణ వాళ్లమ్మ తినడానికి ఏమైనా ఇస్తుందేమో అనుకుని బయటరుగు మీద కూర్చున్నాడు. ఆమె నిదానంగా లేచి, వాళ్ల పిల్లలతో పాటు ఒక గ్లాసు కాఫీ ఇచ్చింది. తినడానికి ఏమీ ఇవ్వదని రాముడికి అర్థమైపోయింది. వాళ్ల కోసం వాళ్లు ఏమైనా చేసుకుంటే, తనకూ కొంచెం పెట్టే వారు. పొద్దున్నే తనకు చేసిపెట్టాలనే ఊహ రమణ వాళ్లమ్మకు రాలేదు. చనువుగా వంటింట్లోకి వెళ్లి అడగడానికి, తను వాళ్ల బంధువు కాదు.
పోగా పెద్ద కులం వాళ్లు. ధనవంతులు. మొత్తం చదవండి »
Jun2010
నాగలకుంట లో తెల్లవారింది.
నరసింహులు సైకిల్ బెల్లు గణగణ లాడిస్తూ వీధిలోకి వచ్చాడు. అప్పటికింకా ఆరు కాలేదు సమయం.
ఎంత బలంగా బెల్లు నొక్కుతున్నా కుడిచేతి బోటనవేలు నొప్పి పెడుతోంది గాని బెల్లు అంతగా మోగడం లేదు. అక్కడక్కడా పిల్లలు బిగ్గరగా పాఠాలు చదువుకుంటున్న చప్పుడు వినిపిస్తోంగ్. దిన పత్రికలు వేసే కుర్రాళ్ళు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ రివ్వున దూసుకు వెడుతున్నారు సైకిళ్ళ పైన.
Apr2010
“స్వీటీ , ఎలాగున్నావు ? ఎంత ప్రయత్నించినా పెళ్ళికి రాలేకపోయాను. ఇదిగో అదిగో అంటూ తీరిక చేసుకునేసరికి ఇదిగో ఇన్నాళ్ళయింది ? సాయంత్రం మీ ఇంటికి రానా…. ఉహూ….. వస్తున్నాను”
తులసి మనసు పొంగిపోయింది. రాకేష్ దూరపు బంధువే కాదు చిన్నప్పటి మిత్రుడు కూడా.
“సాయంత్రం ఎందుకు రాకేష్…. లీవ్ పెడతాను లంచ్ కి వచ్చేయ్యి.” మొత్తం చదవండి »
Apr2010
ఒళ్ళంతా చలి చుట్టేసినట్లైంది పండూకి. అప్పటిదాకా మంచి నిద్రలో వున్నవాడికి వచ్చిరానట్టుగా మెళకువ వచ్చింది. అమ్మ పొట్టమీద చెయ్యేసి పడుకుందామని పక్కకి ఒత్తిగిలాడు. చెయ్యి చాస్తే మంచం ఖాళీగా తగిలింది. అమ్మ అప్పటికే లేచేసి ఉంటుంది అనుకోగానే వాడికి ప్రాణం ఉసూరుమన్నది. కాళ్ళు కొద్దిగా దగ్గరికి లాక్కోని అమ్మ నడుంచుట్టూ చెయ్యేసి డొక్కలోకి దూరి పోయినట్టు పడుకుంటే వాడికి ఎంతహాయిగా వుంటుందో . అమ్మ తన చుట్టూ చేతులేసి దగ్గరగా పొదువుకుంటే చుట్టూ వెచ్చని కోట కట్టినట్లుగా ఉంటుంది. మొత్తం చదవండి »
Apr2010
పొద్దంగి సీకటి ముసురుతుంది. గెట్టు మీద కూసున్న లచ్చన్నకు మనసు మనసుల లేదు. ఒక్క తీర్గ ఆలోచనల పడ్డడు. కండ్ల ముంగటి నారు ముదురుపోతానంది. ఏం చేసుడో ఏందో బొత్తిగా అర్థం అయితలేదు. నెత్తికి సుట్టుకున్న తువ్వాల తీసి మొకం తుడుసుకున్నడు. కంట్లే నుంచి కారిన నీళ్ళ చారికలు కూడా తుడుచుకున్నాడు. మొత్తం చదవండి »
Feb2010
రచయిత: యస్. గణేశ లింగం
“అమ్మా …! అని కొడుకు సుగంతన్ పిలిచినట్లై తంగమ్మ మూతపడుతున్న కళ్ళను ఉలిక్కిపడి తెరిచింది. కొడుకొచ్చాడన్న ఆరాటంతో బైటికొచ్చిన తంగమ్మకి ఎవరూ కనిపించలేదు. ‘ఏదో కల గని వుంటనులే’ అనుకుంటూ తిరిగొచ్చి పడుకుంది.. ఇంత రాత్రయినా సుగంతన్ జాడలేదు. మొత్తం చదవండి »
Feb2010
దసరా పండక్కి నాలుగు రోజులు శెలవిస్తారని విన్న క్షణం నుంచీ నా మనసుకి రెక్కలు మొలిచాయి. ఎపుడెపుడు యింటికెళ్ళిపోతానా అన్న ఆరాటం. అమ్మా నాన్నల్తోపాటు అస్తమానం గుర్తొచ్చే మా తోటలోని పూలని పలకరించి ఎన్నాళ్ళయిందో . . . పూలరెక్కల సీతాకోక చిలుకల్ని పరామర్శించాలన్న తహతహ . . . జైల్లాంటి మా హాస్టల్ చుట్టూతా ఉన్న ఎత్తైన ప్రహరీగోడ మీంచి ఎగిరెళ్ళి మా తోటలో వాలిపోవాలన్న కోరిక . . .
సీతాకోక చిలుక . . . ఎంతందమైన పేరు ! దాని సోయగమంతా రంగురంగుల రెక్కల్లో దాచుకుని పూలవనాలమీద ఎగుర్తుంటే చూట్టం ఎంత తీయటి అనుభవమో . . . . మొత్తం చదవండి »