సూచిక: 'అనువాదాలు'

అలిసిన అలలు

ఒరియా మూలం – రాజకిషోర్ దాస్

ఏమవుతుందిట
అలలు పొంగి పొరలకపోతే

సాగరం నీరవమైపోతే
శ్మశాన భయ కంపనలు
యావత్తు శరీరాన్నీ ఆవహిస్తే

మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

నిప్పు రాజుకుంది…

రచయిత: యస్. గణేశ లింగం

“అమ్మా …! అని కొడుకు సుగంతన్ పిలిచినట్లై తంగమ్మ మూతపడుతున్న కళ్ళను ఉలిక్కిపడి తెరిచింది. కొడుకొచ్చాడన్న ఆరాటంతో బైటికొచ్చిన తంగమ్మకి ఎవరూ కనిపించలేదు. ‘ఏదో కల గని వుంటనులే’ అనుకుంటూ తిరిగొచ్చి పడుకుంది.. ఇంత రాత్రయినా సుగంతన్ జాడలేదు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »అనువాదాలు, కథలు

నేర పరిశోధన

ఆంగ్ల మూలం: సర్ ఆర్థర్ కోనన్ డాయిల్
తెలుగు: కొడవటిగంటి కుటుంబరావు

పూర్వ భాగం

1. మిస్టర్ షెర్లాక్ హోమ్స్

1878లో లండన్ విశ్వవిద్యాలయంలో డాక్టరాఫ్ మెడిసన్ పట్టం సంపాదించి, సైనిక వైద్యాధికారి కావటానికిగాను ప్రత్యేక శిక్షణ పొందటానికై నెట్లీ వెళ్ళాను. అక్కడ శిక్షణ పూర్తికాగానే నన్ను ఫిప్త్ నార్తంబర్లాండ్ ఫ్యుసిలియర్స్ దళంలొ అసిస్టెంట్ సర్జన్ గా నియమించారు. ఆ సమయంలో ఈ దళం ఇండియాలో ఉన్నది. నేను దానిని చేరుకునే లోపుగా రెండవ ఆఫ్ఘన్ యుద్ధం ఆరంభమయింది. మొత్తం చదవండి »

11 అభిప్రాయాలు »అనువాదాలు, ధారావాహికలు, నేర పరిశోధన

పచ్చ సంచి

(ఇండోనేషియన్ మూలం — పుతు ఓక సుకాంత)

“అదేం లేదు, నేనేమీ ఇబ్బంది పడటం లేదు,” అతన్ని నమ్మించటానికి ప్రయత్నించింది లియా. “ఆఫీసు పని అయింతర్వాత సాయంత్రం ఒక డాక్టర్ దగ్గర పని చేస్తున్నాను. ఒక్కోసారి ప్రైవేటు రోగుల్నిచూసుకునే అవకాశం కూడా ఉంటుంది.”

“అలాగా, అయితే బాగా అలసిపోతూ ఉంటావు,” అని ప్రేమగా చూశాడు బావా. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »అనువాదాలు, కథలు

కుటుంబరావుగారి అనువాదరచన

Study in Scarlet
Study in Scarlet
ఆర్థర్ కోనన్‌డాయిల్
ఆర్థర్ కోనన్‌డాయిల్

1945 ప్రాంతాల మద్రాసులో చక్రపాణి ఆంధ్రజ్యోతి అనే పత్రికను కొన్నేళ్ళు నడిపారు. మా నాన్న కుటుంబరావుగారి రచనలు అందులో పడుతూఉండేవి. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »అనువాదాలు, నవల

హుకిటోల

(ఒరియా మూలం: రాజకిషోర్ దాస్ )

ఎంత దివ్యమైనది
ఏకాంతం
ఎవరు అవునన్నా కాదన్నా
అవును అవును అనే అంటావు
నాతో పాటు నువ్వూ
ఓ హుకిటోలా!

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

గులాబీలు, ఓ వేసవి చివర

(మేరీ ఆలివర్ 2004 కవిత్వం “బ్లూ ఐరిస్ “లో “రోసెస్, లేట్ సమ్మర్” కి అనువాదం)

ఏమవుతుంది,

mary-oliver1
mary-oliver1

ఈ ఆకులన్నీ
ఎరుపెక్కి, బంగారు రంగు దాల్చి
రాలిపోయాక? మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు, దర్వాజ

గోడ

-జీన్ పాల్ సార్త్ర్ మూలం : లా మ్యూర్ ( ది వాల్)

అనువాదం: జె.బాల్ రెడ్డి.

వాళ్ళు నన్నో పెద్ద తెల్లటి గదిలోకి తోశారు. కాంతి సూటిగా కండ్లమీద పడుతోంది. కండ్లు మిటకరించి చూడాల్సి వస్తోంది. టేబుల్ వెనక నలుగురు మనుష్యుల్ని చూశాను. పౌరదుస్తుల్లో ఉన్నవారు ఏవో కాగితాల్ని పరిశీలిస్తున్నారు. వారి వెనక ఓ ఖైదీల గుంపుంది . వారిలో కొందరు నాకు తెలుసు. వారిని  చేరడానికి మేము గదంతా దాటి అవతలి కొసకు చేరాలి. మిగతావారు విదేశీయులై ఉండాలి. నా ఎదురుగా ఉన్న ఇద్దరికి గిరజాల జుట్టు,గుండ్రటి తలకట్టుంది. నాకు చూడ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళనిపించింది. అందులో పొట్టివాడు ఆందోళనగా పంట్లాంను గోక్కుంటున్నాడు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »అనువాదాలు, కథలు

బాగ్దాద్ కొడుకులు కూతుళ్ళు

- జునైద్ ఆలం (అనువాదం ; జె.బాల్ రెడ్డి)

బాగ్దాద్ కొడుకులు కూతుల్లారా!!!!
బాగ్దాద్ కొడుకులు కూతుల్లారా!!!!
మీ విముక్తి ఘడియ సమీపించింది
కృంగదీస్తున్న భుజాల మీద బరువుతో బలంగా
మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, కవితలు

అమెరికన్ కవిత్వంలో ఒక దక్షిణం గాలి… కాజిం అలి

“తెలుగు” అన్న మూడక్షరాలు వినగానే కాజిం అలి హృదయం పసిపిల్లాడిలా కేరింతలు కొట్టింది, అతని హైదరాబాదీ బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి.

వొక ఆదివారం మధ్యాన్నం ఆస్టిన్ లోని “బార్న్స్ అండ్ నోబల్స్” పుస్తకాల షాపులో నాకు ఎంతో ఇష్టమయిన కొబ్బరి ముక్కలు తురిమిన కాఫీ తాగుతూ మొదటి సారి కాజిం అలి కవిత్వం చదివాను. ఆ కాఫీ రుచికీ, కాజిం అలి కవిత్వానికి కాస్త చుట్టరికం వుంది. కొబ్బరి ముక్కా, కాఫీ రెండూ భిన్నమయిన రుచులు. కొబ్బరి ముక్క అనగానె నాకు మా ఖమ్మంలో పెద్ద కొండ మీద కొలువైన నరసిం హ స్వామి , ఆ గుడికి కొబ్బరి ముక్కల ప్రసాదం కోసం వెళ్తూండే నా బాల్యం గుర్తొస్తాయి, కాఫీ అంటే నాకు అమెరికా. ఇక్కడికి రాక ముందు నాకు కాఫీ అలవాటు లేదు. ఈ భిన్నమయిన రుచుల కలయిక నాలుక మీద ఆడుతూండగా , కాజిం అలి కవిత్వం చదివాను.

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »అనువాదాలు, దర్వాజ

ప్రవక్త లేని ప్రపంచం

ఉర్దూ మూలం : మజర్ మెహదీ

ఈ ప్రపంచం
ఇతర ప్రపంచాల కన్నా భిన్నంగా ఎప్పుడుంది?
అవే జలపాతాలు
అవే ఆకుపచ్చని లోయలు మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

పాలస్తీనా

మూలం: లీసా సుహైర్ మజాజ్

మీ కళ్ళు నేల మీదే ఉండాలి సుమా
నేల మీది రాళ్ళను మాత్రం చేతుల్లోకి తీసుకోకండి
జట్లు కట్టి గెంతులాడి రాళ్ళందుకోవద్దందామె
పక్కవాళ్ళను గురించి పట్టించుకోవద్దు
వాళ్ళబ్బాయిని నిన్న రాత్రి అరెస్ట్ చేశారు
చాకలి కొట్టును దాటొద్దు, పక్కలను చక్కబెట్టండి మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, కవితలు

పరిచయం

మూలం: కమలా(దాస్‌) సురయ్యా
తెలుగుసేత: పసుపులేటి గీత

నాకు రాజకీయాల గురించి ఏమీ తెలీదు,
కానీ గద్దెనెక్కిన వాళ్ళ పేర్లు తెలుసు
వారాల పేర్లు చెప్పినట్టు, నెలల పేర్లు చెప్పినట్టు,
నెహ్రూ నుంచి మొదలుపెట్టి అందరి పేర్లనీ అప్పజెప్పగలను మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

మంచీ-చెడూ

మూలం: వైరముత్తు, అనువాదం: ఆర్‌. శాంతసుందరి

నీతి వాక్యాలు వల్లించిన
తొలిభాష ఏది?
తమిళమా? చైనీసా??
లాటినా? గ్రీకా?
మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

వర్తమానం కోసం ఒక స్మృతి గీతం

ఎడోనిస్ (జననం: 1930) అనేది కలం-పేరు. కవి అసలు పేరు అలీ అహ్మద్ సయీద్. సిరియాలో పుట్టి పెరిగారు. అక్కడే చదువుకున్నారు. ఆయన రాజకీయ అభిప్రాయాలు గిట్టని ప్రభుత్వం ఆయనను బాగా వేధించి, జైలు పాలు చేసింది. 1956లో బీరుట్‍ వెళ్లిపోయి, లెబనాన్ పౌరుడిగా స్థిరపడ్డారు. 1958లో ‘మవాఖిఫ్’ పత్రిక ప్రారంభించి, అరబిక్ కవిత్వంలో ఆధునిక మార్పులు తీసికురావడానికి కృషి చేశారు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »అనువాదాలు, కవితలు

అధ్యాయం 12: తిరిగి వచ్చిన భూత నాట్యం

ఎనభై ఐదేళ్ల క్రితం
భూత నటులు అనుకునే వారు
నాట్యం చేయడం ద్వారా
తాము భూమిని మారుస్తామని.
మనల్ని మార్చుకోడానికే నాట్యం చేస్తాం.
మనం మారినప్పుడు మాత్రమే
భూమిని మార్చడానికి ప్రయత్నించగలం.
- క్రౌ డాగ్‍, 1974

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »అనువాదాలు, అపరాజిత

ప్రేమా, యుద్ధమూ, చరిత్రా వెరసి యెహుదా అమిచా

- పసుపులేటి గీత

వ్యావహారిక హీబ్రూ భాషలో కవిత్వం రాసిన తొలి ఇజ్రేలీ కవి యెహుదా అమిచా. జర్మనీలో 3, మే, 1924న అమిచా జన్మించారు. ఆయన కుటుంబం 1936లో పాలస్తీనాకి వలస వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన బ్రిటీష్‌ యూదు దళాలతోను, 1948లో జరిగిన అరబ్ -ఇజ్రేలీ యుద్ధంలో ఇజ్రేలి రక్షక దళాలతోను కలిసి పని చేశారు. తరువాత హీబ్రూ సాహిత్యంపై కృషి చేశారు. కవిత్వంతో పాటు నవలలు, కథలు కూడా రచించారు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

Next »