Feb2010
కె రాజశేఖర రాజు
దాదాపు పాతికేళ్ల క్రితం ఎస్వీ యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజుల్లో దూరదర్శన్‌లో ఒక మూకీ చిత్రం చూపించారు. నాటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచేవ్ భారత్‌ను సందర్శించిన సందర్భంగా చిత్రమేళా రూపొందించి రష్యన్ సినిమాలను వరుసగా చూపించారు. ఓ రాత్రి పది గంటల తర్వాత దూరదర్శన్‌లో చూసిన ఆ సినిమా వీక్షణ అనుభూతులు ఇప్పటికీ నాలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. అప్పటికే యుద్దనౌక పొటెంకిన్‌లోతిరుగుబాటు గురించి పుస్తకాల్లో, పేపర్లలో చదివి తెలుసుకోవడం వల్ల కూడా ఈ సినిమా అంటే పెద్ద కుతూహలం.
మొత్తం చదవండి »
వీడియో / ఆడియో
Jul2009
ప్రాణహిత
- సి.కాశిం
ఉద్యమ పాట జీవిత చిత్రణ
తెలంగాణ ప్రాంతం గుండె గొంతుకలో నుంచి పాట ఉబికి వచ్చింది. ఇక్కడ బాధ ఉంది. చెరబడ్డ జీవితాలున్నాయి. మగ్గిపోయిన బతుకులున్నాయి. ఇట్లాంటి మూగ రోదన నుంచి సన్నని గొంతు రాగానికి చేరువైంది. ప్రకృతిలో లీనమైంది. పని పరికరాలే వాద్యాలయ్యాయి. పల్లెరు గాయాలపై నడిచిన పాదాలు పాటతో ఉపశమనం పొందాయి. దొరగడీల్లో బందీ అయిన బాల్యంకు ముల్లు కర్ర పాట తోడైంది. కుత కుత ఉడికిన జీవితం నుంచే పాట పుట్టింది.
మొత్తం చదవండి »
వీడియో / ఆడియో, సాహిత్య వ్యాసాలు
Jul2009
భరద్వాజ
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరి పోతే
నిబిడాశ్చర్యం తో వీరు!
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె!
1958వ సంవత్సరం – ఆగస్టు నెల 29 వ తేది – అమేరికా లోని ఇండియానా రాష్ట్రంలోగల గేరీ అనే చిన్న పట్టణంలో ఎవరూ ఊహించి ఉండరు ఆరోజు ఒక తార జన్మించబోతోందని, రాబోయే యాభై సంవత్సరాల్లో సంగీతప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుందని – ఎవరూ అనుకుని ఉండరు ఆ రోజు జన్మించబోయే తార భవిష్యత్తులో అనేక సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువౌతుందని – ఒక సంగీత వ్యవస్థనే సృష్టిస్తుందని… ఆ తార పేరే మైఖెల్ జాక్సన్! మొత్తం చదవండి »
వీడియో / ఆడియో, సంస్మరణ
Jun2009
ప్రాణహిత
- సి.కాశిం
ఉద్యమ పాటకు ప్రజల పాటలే మూలం
కష్టజీవుల జీవితమే ఓ పాట. “పాట అంటే ఒక చర్చ. చర్చ లేవదీయటం ఒక సత్యాన్ని కనుక్కోవడం. ఆ సత్యాన్ని ఆచరణలో పెట్టడం.” (గద్దర్ – తరగని గని – పుట.1) పాట, గేయం పర్యాయపదాలుగా వాడుతున్నారు. ‘గేయం’ సంస్కృత పదం. పాట తెలుగు పదం. అయినా ఒకే సందర్భానికి ఉపయోగిస్తున్నారు.
“గేయం గీతం సమానార్ధకాలు పాడేది గీతం లేదా గేయం” (అమర కోశం – పుట.140)
మొత్తం చదవండి »
వీడియో / ఆడియో, సాహిత్య వ్యాసాలు