ప్రాణహిత
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
అజ్నబీ షాయర్
		<description><![CDATA[ఎవరస్తారనో
ఇంత విరగ కాస్తోందీ వెన్నెల
ఎంత సంబర పడుతుందో
ఇప్పపూల వింత వాసన
ఎవరస్తారనో
నీటి చెలమల్లో -
పులకిస్తున్న ఊటలు
ఎన్ని సాహస ఊహలో
ఇసుక మీద పొర్లి
తీయగా పరుగులు తీస్తున్న
మనసులాంటి జలాలు
ఎవరస్తారనో
బాటల వెంట-
పూల తోరణాల్లా
చేరిన పిల్లల గుంపులు
ఏమి తెస్తారనో
దీపాలు వెలిగించిన పండగలా
నిర్మల నిశ్చల చూపుల్లో మెరుపులు
ఎవరస్తారనో
వర్షంలో తడిసిన ముత్యంలా
తెల్లవారు జాములో
నిరీక్షించే విప్పారిన ముఖాలు
ఎప్పుడొస్తారనో
కురులు దులిపి-
సవ్వడులు లేపినట్టు
నదిమీది తెప్పలకు
నిలకడలేని అలలకలలు
ఎవరస్తారనో
ఎన్ని ఆటంకాలనైనా
ఎదుర్కొని స్వాగతించటానికి
ప్రాణాల్ని వీణలుగా చేసిన
బతుకుపోరు తన్మయత్వాలు
ఎవరస్తారనో …………………….?!
ఎవరస్తారనో …………………….?!
		<slash:comments>5</slash:comments>
కొన్ని మరణాల్లోంచి
		<description><![CDATA[మరణాల్ని కీర్తించడం కొత్తేమీ కాదు
మణికర్ణికా ఘాట్ లో
రగిలే ఆరని చితిమంటల్లో
నిత్యం నన్ను నేను దహించుకొంటున్నవాడ్నే
చరిత్రలో స్వర్ణ యుగాలంటూ ఉండవు
రాజు దైవాంశ సంభూతుడూ కాదు
పాలించే వాడెవడైనా
పదఘట్టనల కింద నలిగిన ఆత్మలు
మౌనంగా రోదిస్తూనే ఉంటాయి
చార్మినార్ ల సాక్షిగా
ఆకాశంలో నిలబడి జరుగుతున్న తంతును
వీక్షిస్తూనే వుంటాయి
నన్ను నేను మొలకెత్తించుకుంటున్న
చారెడు నేలపై మోపిన
రాక్షస పాదపు జాడలు
మనసులోంచి తొలగిపోలేదు
పురుగుల మందు సేవిస్తూనో
దూలానికి వేలాడుతూనో
నన్ను ఆక్రమించిన పాదాలను మోస్తున్న
బోయిలను గమనిస్తూనే ఉన్నాను
పెదాల చిరునవ్వులపై విరిసిన
కత్తుల్ని ఆస్వాదించిన వాడ్ని
నువ్వు నడిచెళ్ళిన దారుల్లొ
తెగిపడిన శిరస్సుల్ని
పోగుచేసుకొంటున్న వాడ్ని
తారీఖులు దస్తావేజులతో పనిలేని
యుద్ధాలలో చెల్లాచెదరైన [...]]]></description>
		<slash:comments>5</slash:comments>
నాగలికర్రొకటి తీసుకునిరా
		<description><![CDATA[సమూహంలొ నిన్ను నువ్వు తప్పిపోవటం
నిన్ను నువ్వే వెతుక్కోవటమంటే
అల్లుకున్న బురద తీవెకింద
మాయమైన బతుకుపిందెల్ని వెతుక్కోవటమే
బెదిరిన ఆబోతు మీదికి ఒరికినట్లు
కట్టలు తెంచుకుంది, ఈ ప్రాణ జలమేనా !
రెప్పలే లేనట్లు కాచుకున్నా
మట్టికట్ట ఉప్పై కరిగిందేమిటీ?
  కడుపులో పెట్టుకుని చూచుకున్న నదికి
కడుపు చించితే కాళ్లమీదేమిటి, కాటిమీదాపడుతుంది
ఊరుపోయింది, వాడపోయింది
బువ్వజాడపొయింది, పుస్తెల తాడూ పొయింది
పిల్ల పెళ్ళి కోసం తెచ్చిన అరివేణికుండలో
ఆకలి మేటేసింది
నువ్వు బురద సముద్రాన్ని ఈదుతున్నపుడు
  గంజిపెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి చీకటిని తొడుక్కుని
  బతుకు పుట్టిని నట్టేట ముంచేసే సరంగులు
పంట పొలాల లేజర్ షో నిర్వహించేసి
ఆహారపు పొట్లాల కింద [...]]]></description>
		<slash:comments>6</slash:comments>
నీకెలా నమస్కరించను?
		<description><![CDATA[చందమామను జేబులోకి తెచ్చుకున్నవాడా
మబ్బుల గిన్నెలో వెన్నెలని జీవితం చేసుకున్నవాడా
ఉద్యమ సముద్రంలో అలుపు లేకుండా ఈదినవాడా
వీరుడా నీకు జోహార్
ఇది స్వప్నమో జీవితమో
ఇది నిజంగా నిజమో లేక అబద్దమో
అర్థ రాత్రి ఇలా సూర్యుడు పొడుస్తాడా
పగిలిన మృదంగం ఎంత బాగా నాదించింది
వీరుడా ఒక్క చిరునవ్వు నవ్వు
భాగోతం తైతక్కలాడింది
డప్పు గొంతు విప్పింది
అర్థరాత్రి తుపాకి దెబ్బ విని
అరిచే ఖడ్గ మృగం ఉలిక్కి పడింది
వీరుడా నిన్నెలా ప్రశంసించను
ఆకాశం నిండా ఆత్మగౌరవం జండా
రెపరెప లాడిన క్షణం ఇది
వర్షపు చినుకులకు దున్నపోతు
చలించిన క్షణం ఇది
మూడున్నర కోట్ల ఊపిరి దీపాల [...]]]></description>
		<slash:comments>0</slash:comments>
నీ దారెప్పుడూ ఇంతే…
		<description><![CDATA[మర్రి చెట్టు ఊడల్లా నువ్వూ నేను అల్లుకుంటూ పోతామా
నీడల్ని పరుచుకుంటూ గలగలలు లేకుండా ప్రవహిస్తామా
ఐనా- చిరిగిన పేజీని ఇష్టంగా చదివించి ముగింపు తెలియకుండా తెలియనితనం లోకి నెట్టివేసినట్లు
సంగమం తరువాత ఎడారి మొక్కను చేస్తావు !
నీ దారెప్పుడూ ఇంతే – విందు పంక్తిలో చివరి విస్తరిలా…
బండికింద కుక్కపిల్లల్లా తోకలూపుకుంటూ
వెనక కాళ్లతో ప్రపంచాన్ని తన్నుకుంటూ వెళ్లిపోతుంటామా
దించిన తల ఎత్తకుండా గుండెమీద శిశిర సంధ్యలను మోస్తూ ఉంటామా
ఐనా- పుస్తకంలోని అక్షరాలు ఒలికిపోకుండా జాగ్రత్త పడలేని అమాయకత్వాన్ని
గానుగలో నలిగే విత్తనాన్ని చేస్తావు!
నీదారెప్పుడూ ఇంతే [...]]]></description>
అలిసిన అలలు
		<description><![CDATA[ఒరియా మూలం – రాజకిషోర్ దాస్
ఏమవుతుందిట
అలలు పొంగి పొరలకపోతే
సాగరం నీరవమైపోతే
శ్మశాన భయ కంపనలు
యావత్తు శరీరాన్నీ ఆవహిస్తే
హఠాత్తుగా ట్రైన్
అరణ్యపు టన్నల్ మధ్య
కీచుమని ఆగిపోతే
మాఘమాసపు సంజె వేళ
ఎవరు పట్టించుకుంటారు
సాగరాన్ని
అడుగుతారు ఎవరు
ఉత్తుంగ తరంగాలు
ఎక్కడని
ఛిన్నా భిన్నం చేసారు ఎవరు
నిశ్చల నిర్లక్ష్య నడతను
తుడిచి వేసారు ఎవరు
గాఢ నీల వర్ణాన్ని
పులిమి పట్టించారు ఎవరు
నల్ల మట్టిని
నల్ల తారు రంగుని
సరుగుడు తోటల్లో
కదలిక లేదు
చడీ చప్పుడు లేదు
స్పందన అన్న మాటే లేదు
ఉంది సముద్ర తీరం
శుష్క దారువులా
స్థిరంగా
ఒంటరి ఒంటరిగా
ఆకాశంలోకి లేచి
పొడుగ్గా తాటి చెట్లు
పశ్చిమ దిశలో
మెరుస్తూ కనబడుతూ
ఆరుతూ మాయమవుతూ
తాటి మాటున
గుడ్లగూబ కళ్ళు
నత్తలా ముడుచుకుపోతూ
ముడుచుకుపోతుంది
నత్తలా
నా [...]]]></description>
		<slash:comments>2</slash:comments>
నిప్పు రాజుకుంది…
		<dc:creator>నీలిమ</dc:creator>
		<description><![CDATA[రచయిత: యస్. గణేశ లింగం
“అమ్మా …! అని కొడుకు సుగంతన్ పిలిచినట్లై తంగమ్మ మూతపడుతున్న కళ్ళను ఉలిక్కిపడి తెరిచింది. కొడుకొచ్చాడన్న ఆరాటంతో బైటికొచ్చిన తంగమ్మకి ఎవరూ కనిపించలేదు. ‘ఏదో కల గని వుంటనులే’ అనుకుంటూ తిరిగొచ్చి పడుకుంది.. ఇంత రాత్రయినా సుగంతన్ జాడలేదు. అతని పక్క దుప్పట్లు నిన్న చుట్ట చుట్టిపెట్టినవి అలాగే వున్నాయి. రాత్రి పూట వూళ్ళో కర్ఫ్యూ అమల్లో వుంది. జాఫ్నాలొ తమిళ ప్రాంతాలన్నిటా ఇదే పరిస్థితి. పది దాటిన తర్వాత ఎవరూ బైట [...]]]></description>
రెక్కల హరివిల్లులు
		<dc:creator>సలీం</dc:creator>
		<description><![CDATA[దసరా పండక్కి నాలుగు రోజులు శెలవిస్తారని విన్న క్షణం నుంచీ నా మనసుకి రెక్కలు మొలిచాయి. ఎపుడెపుడు యింటికెళ్ళిపోతానా అన్న ఆరాటం. అమ్మా నాన్నల్తోపాటు అస్తమానం గుర్తొచ్చే మా తోటలోని పూలని పలకరించి ఎన్నాళ్ళయిందో . . . పూలరెక్కల సీతాకోక చిలుకల్ని పరామర్శించాలన్న తహతహ . . . జైల్లాంటి మా హాస్టల్ చుట్టూతా ఉన్న ఎత్తైన ప్రహరీగోడ మీంచి ఎగిరెళ్ళి మా తోటలో వాలిపోవాలన్న కోరిక . . .
సీతాకోక చిలుక . . [...]]]></description>
		<slash:comments>1</slash:comments>
పొక్కిలి
		<description><![CDATA[అగ్గిపెట్టె గుగ్గిపెట్టె
లవ్వో లాటో
చెంచో బైటో
ఠాంగు ఠీంగు
తమ్మళ్ళ పెద్దవ్వ
తసుక్కు… తుసుక్కు
వాడకట్టు పిల్లలు ముగ్గురు నల్గురు కలిసి ఇంటి ముంగటి గచ్చుమీద అర్సేతులు బోర్లేసి ఆడుకుంటుండ్రు. ఒక చెయ్యి అగ్గిపెట్టె గుగ్గిపెట్టె… అనుకుంట బోర్లేసిన వేళ్ళను తాకుకుంట పోతంది.. దానితోనే మిగిలినోళ్ళ కండ్లూ పోతున్నాయి… తుసుక్కుమన్న దగ్గర వేలు లోపలికి ముడుసుక పోతంది. ముడుసుకపోయిన వేలు పానం పోయినంత తల్లడిల్లుతంది. అగ్గిపెట్టె గుగ్గిపెట్టె… మళ్ళా మొదలైతంది… మళ్ళా వేలు ముడుసుకుపోతంది…
పొద్దు గూట్లెవడ్డది. దేవయ్య సైకిల్ మీద మందు బస్తాలు తీసుకుని [...]]]></description>
		<slash:comments>1</slash:comments>
నల్ల నినాదం అతని కవిత్వం!
		<description><![CDATA[చాలా కాలంగా వెంటాడుతున్న కవి లాంగ్స్టన్ హ్యూస్!
ఎప్పుడో 1902లో పుట్టి, ఏ 1967లోనో కన్నుమూసిన ఈ కవి ఇప్పుడు నా లోకంలో ఎలా కన్ను తెరుచుకున్నాడు?! అతని కవిత్వ పాదాల్లోని ఏ శక్తి నన్ను అటు వైపు జర జరా ఈడ్చుకెళ్ళింది? ఇటీవల హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో హెన్రీ గేట్స్ అనే వొక నల్ల ప్రొఫెసర్ మీద పోలీసు దాడికి నిరసనగా “తోలు మందం” అనే శీర్షికతో (ఈ కవిత నా కొత్త సంపుటి “వూరి చివర” [...]]]></description>
రాయలసీమ జానపద సాహిత్య సౌరభం
﻿బోల్షెవిక్ విప్లవ పొలికేక "బ్యాటిల్‌షిప్ పొటెంకిన్"
		<slash:comments>2</slash:comments>
పడమటి నీడ –  సమీక్ష
		<slash:comments>0</slash:comments>
నవలను చదివించే విమర్శ ‘అతడు – ఆమె : మనం’
		<description><![CDATA[మంచి సాహిత్య విమర్శ మంచి సాహిత్యాన్ని చదివేట్టు పాఠకుల్ని ప్రోత్సహిస్తుంది. సాహిత్య పఠనను ప్రోత్సహించడం మాత్రమే గాక, పాఠకులలో సాహిత్యంపట్ల, సమాజంపట్ల ఆలోచనల్ని రేకెత్తించి వాళ్ళ సంస్కారంలో మార్పు తీసుకొని వస్తుంది. రచయితలు సమాజం ఎలా ఉంది, అలా ఎందుకుందో చెబితే; విమర్శకులు సాహిత్యం ఎలా ఉందో, అలా ఎందుకుందో చెబుతారు. ఇద్దరి ప్రయత్నమూ పాఠకులలో ఆలోచనలు రేకెత్తించి కర్తవ్యోన్ముఖులను చేయడమే.
గాంధీజీ నాయకత్వంలోనే నడిచిన భారత జాతీయోద్యమాన్ని విమర్శనాత్మక దృక్పథంలో విశ్లేషిస్తూ లక్ష్మణరావు దినచర్య కథనంలో రాసిన [...]]]></description>
		<slash:comments>1</slash:comments>
నేర పరిశోధన
		<dc:creator>కొడవటిగంటి కుటుంబరావు</dc:creator>
		<description><![CDATA[ఆంగ్ల మూలం: సర్ ఆర్థర్ కోనన్ డాయిల్తెలుగు: కొడవటిగంటి కుటుంబరావు
పూర్వ భాగం
1. మిస్టర్ షెర్లాక్ హోమ్స్ 
1878లో లండన్ విశ్వవిద్యాలయంలో డాక్టరాఫ్ మెడిసన్ పట్టం సంపాదించి, సైనిక వైద్యాధికారి కావటానికిగాను ప్రత్యేక శిక్షణ పొందటానికై నెట్లీ వెళ్ళాను. అక్కడ శిక్షణ పూర్తికాగానే నన్ను ఫిప్త్ నార్తంబర్లాండ్ ఫ్యుసిలియర్స్ దళంలొ అసిస్టెంట్ సర్జన్ గా నియమించారు. ఆ సమయంలో ఈ దళం ఇండియాలో ఉన్నది. నేను దానిని చేరుకునే లోపుగా రెండవ ఆఫ్ఘన్ యుద్ధం ఆరంభమయింది. నేను బొంబాయిలో [...]]]></description>
కళాకృతులూ, డైనొసార్లూ
జనవరి 2010 సూచిక
		<dc:creator>ప్రాణహిత</dc:creator>
		<description><![CDATA[ప్రాణహిత పాఠకులకు 2010 నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
కె. లక్ష్మా గౌడ్ 
ఈ సంచికలో…
కవితలు
గీతాంజలి కవితలు రెండు :
చెప్పుకోవటానికేంలే
ఒరిగి ఒరిగి మరణిస్తాను
ఇప్పుడు నువ్వన్నదే సై – హరగోపాల్
సుదర్శనుడి కళ్ళు – కె.శివారెడ్డి
కరిగిన స్వప్నం – కెక్యూబ్ వర్మ
చెకుముకీ – వఝల శివకుమార్
వేణు సంకోజు కవితలు రెండు:
తిష్ఠ
ప్రజల శక్తిగా …
బాలగోపాలుడు – జనభూపాలుడు- అమర్
పుస్తక మార్గం – మంచికంటి
ఆంతరంగికం – నాగరాజు
కథలు
తాకట్టు – కాంతి కుమార్
పోరు తప్పదా – ముదిగంటి సుజాతా రెడ్డి
పడమటి నీడ – హనీఫ్
సాహిత్య వ్యాసాలు
తెలంగాణ సాహిత్యం [...]]]></description>
		<slash:comments>0</slash:comments>