రచయిత(త్రు)లకు విజ్ఞప్తి

రచయితలకు, రచయిత్రులకు స్వాగతం!

ప్రాణహిత ఆగకుండా ప్రవహించాలంటే సజీవమైన రచనలు ఎంతో అవసరం. సమాజం పట్ల బాధ్యతతో రాసే రచనలు, ప్రజల వైపు నిలబడ్డ రచనలు, ప్రజాస్వామిక భావాలని విలువలని ప్రతిఫలించే రచనలు ప్రాణహితను నిరంతరం ప్రవహించేలా చేస్తాయి. అటువంటి రచనలను వీలయినంతగా సేకరించే ప్రయత్నం మా శాయశక్తులా మేం చేస్తాం. అయితే మా ప్రయత్నం మీ సహకారం లేనిదే విజయవంతం కాలేదు. కాబట్టి మీ రచనలని ప్రాణహితలో ప్రచురణకై మాకు అందచేయాలని మా విన్నపం. వీలయినంత వరకు మరెక్కడా ప్రచురింపబడని (ఇంటర్నెట్ లో బ్లాగు లతో సహా) రచనలయితే ప్రాణహిత కొత్త నీటితో తళ తళ మెరుస్తుంది. అత్యంత సమయోచితమూ, సందర్భానుసారమూ అయినప్పుడూ, తెలుగు నేల పై ప్రచురింపబడి మరీ ప్రాచుర్యంలోకి వచ్చిన రచనలని అంతర్జాతీయ తెలుగు పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో కొన్ని పునర్ముద్రణలు తప్పవని మా అభిప్రాయం. అయితే ఎక్కువ మటుకు తాజా రచనలకే ప్రాధాన్యత నివ్వాలని మా అభిమతం.

ఒక ముఖ్యమైన అంశం మీ దృష్టికి తీసుకు రాదల్చుకున్నాం. ప్రాణహితకి పంపే రచనలు ప్రజల వైపు నిలబడి సామాజిక బాధ్యత తో రాసేవే కాక ఉన్నతమైన సాహితీ విలువలు ఉండి తీరాలని మా అభిప్రాయం. సూక్ష్మం నుండి అనంతం దాకా, నిర్దిష్టత నుండి విశ్వజనీనతనూ ప్రతిఫలించగలిగే రచనలనూ, కలకాలం నిలిచి ఉండే సాహితీ విలువలు గల రచనలనూ, శుష్క రాజకీయ నినాద ప్రాయం కాకుండా, జీవితంలోని, సమాజంలోని విభిన్న కోణాలను దర్శిస్తూ సున్నితంగా, సునిశితంగా, విస్తారంగా మనసుకు హత్తుకునే విధంగా ప్రతిఫలించే రచనలను ప్రచురించి ప్రాణహితను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని మా కోర్కె. ప్రాణహితను సాహితీ పరంగా ఉన్నత శిఖరాలకు తీసికెళ్ళే విధంగా మీ రచనలని మాకందించాలని మా విన్నపం.

మీ రచనలను pranahita.mag[at]gmail.com కి యూనికోడ్ (గౌతమి) ఫాంట్ లో పంపితే మాకు అన్నింటికన్నా సౌకర్యంగా ఉంటుంది. మీ కంప్యూటర్ లో యూనికోడ్ ఇన్‌స్టాల్ చేసుకుని, లేకపోతే http://www.lekhini.org/ లేదా http://www.quillpad.com/telugu సైటులో యూనికోడ్ లో టైప్ చేసి పంపవచ్చు. మీ రచనలు అదివరకే RTS, Shree ఫాంట్స్, Anu ఫాంట్స్, లేదా Telugu Lipi లో టైప్ చేసి ఉంటే వాటిని పద్మ సాఫ్ట్‌వేర్ (http://www.geocities.com/vnagarjuna/padma.html) ని ఉపయోగించి యూనికోడ్ కి మార్చి పంపగలరు. అలా మార్చలేకపోతే RTS, Shree ఫాంట్స్, Anu ఫాంట్స్, Telugu Lipi, ఇంకా ఇతర ఫాంట్స్ లో టైప్ చేసిన రచనలను MS Word లో copy- paste చేసి మాకు పంపితే మేమే వాటిని పద్మ వంటి సాఫ్ట్‌వేర్ లను ఉపయోగించి యూనికోడ్ కి మార్చుకుంటాం. పైన పద్ధతులేమీ వీలు కాని వాళ్లు PDF లో పంపించగలరు. PDF లో పంపితే మేము మళ్లీ టైప్ చేసుకోవాల్సి వస్తుంది కనుక పైన పద్ధతులేవీ వీలుకాని పక్షంలోనే PDF లో పంపగలరని మా విన్నపం. పోస్టులో మీ రచనలను మాకు పంపాలనుకుంటే pranahita.mag[at]gmail.com కి మీరు ఈ-మెయిల్ చేస్తే అమెరికా లేదా హైదరాబాద్ లోని మా పోస్టల్ అడ్రెస్ ను మీకు ఇవ్వగలం.

రచనలు పంపడం గురించి మీకు ఇంకా ఏమైనా సమాచారం అవసరమైతే pranahita.mag[at]gmail.com కి ఈ-మెయిల్ చేస్తే సాధ్యమయినంత త్వరగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇంటర్నెట్ సదుపాయం లేని వారు ఈ కింది చిరునామకి మీ రచనలు పంపవచ్చు.

రచనలు పంపవలసిన చిరునామ:

Pranahita, c/o Vemuganti Murali,
Hno: 11-12-31, Rd #1, Plot# 314,
Sri RamaKrishnaPuram, Snehapuri,
Dilsukhnagar, Hyderabad- 500035
Mobile# +91.99669.48454

ధన్యవాదాలు!

- ప్రాణహిత సంపాదకవర్గం

Sub Pages List

40 అభిప్రాయాలు »

40 Responses to “రచయిత(త్రు)లకు విజ్ఞప్తి”

  1. 1
    Pasunoori Ravinder Says:

    ప్రపంచీకరణ పడగ నీడన తెలుగు భాషా,సాహిత్యాలు కొన ఊపిరితో కొట్టుకుంటున్న వేళ ప్రాణహిత తో ప్రాణం పోసే మీ ప్రయత్నానికి అభినందనలు.
    చెర స్పూర్తిని మా తరానికి అందించాలన్న మీ సంకల్పానికి నా జేజేలు.
    పత్రిక గురించి ప్రచారం పెంచండి.
    ప్రజాకళ వెబ్ పేజిలో ఒక ప్రకటన ఇవ్వండి. సంచిక వెలువడినట్లుగా.
    హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి పరిశోధక విద్యార్థుల పక్షాన
    మీ ప్రయత్నం ఫలించాలని ఆశిస్తూ..
    పసునూరి రవీందర్
    పి.హెచ్. డి. స్కాలర్
    సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్

  2. 2
    desaraju Says:

    కొత్త పత్రికకు స్వాగతమ్ .

  3. 3
    రాకేశ్ తెలంగాణ్ Says:

    తప్పకుండా……….

    గత 20 ఏళ్ళుగా నిద్రాణంగా……బూజులుపట్టినట్లున్న-
    నా (సాహితీ)కలాన్ని,
    లోకాన్ని,
    particular brain tissues ని,
    ఆలోచనల్ని..
    తట్టి..తట్టి మేల్కొలుపుతున్నారు.

    అహ నాతో కాదు.. కాదనే సాహసం చేయలేను, చేయను!
    నేను మళ్ళీ రాయాలి.
    నేనే కాదు – నాలాగే వృత్తి, ప్రవృత్తి వేర్వేరై..
    సాహిత్యపు స్పర్శకోసం అనుక్షణం పరితపించే
    మరెందరికో “స్ఫూర్తిని” రగిల్చేలా రాయాలి
    కసిగా రాయాలి -రసికతగా రాయాలి
    తాదాత్మ్యం చెందాలి -సాహితీ మోక్షం సిద్ధించాలి.

    మన (సమకాలీన) సమాజానికి సాహిత్యపు ప్రయోజనాలెన్ని రకాలో,
    ఎన్ని అత్యవసారాలో…
    అన్నిటికన్నీ………… “కనీసం” ప్రయత్నించాలి.

  4. 4
    R.Surya Prakash Rao Says:

    ప్రపంచాన్ని శాసిస్తూ, ఊగిస్తూ ప్రపంచీకరణ పడగ నీడ ప్రపంచమంతా పరుచుకున్న వేళ ప్రాణవాయువు అందించడానికి పరుగు ప్రారంభించిన ‘ప్రాణహిత’ కు మనసారా స్వాగతం. ప్రపంచీకర ణలోని భిన్న పార్శ్వాలను పాఠకదేవుళ్ళ హృదయాల్ని తట్టేలా అందజేయాలని మనసారా ఆకాంక్షిస్తూ,
    సూర్య ప్రకాశ్ రావు, మేడ్చల్

  5. 5
    rajendra Says:

    ఫలానా వారి గురించి నీకుతెలుసా అని అడిగి అవథలివాడిని ఒక రకమయిన ఆత్మన్యునతా భావానికి గురి చేసి
    ఆనందించే మెధావులకు మనదేశంలొ కొదవ లేదు.నీకన్నా చిన్నవాడు తెలుసుకొ లెకపొవటంలొ వాడి తప్పెంఠ వుందొ నీది అంత కు మించిన తప్పు వుందని మరొక్కసారి ప్రయత్నిస్తున్నందుకు మన సారా అభివాదాలు

  6. 6
    bi. Sree daSarathi Says:

    నేనుసైతమ్ మీదు తపములో సమిధనొక్కటి ధారపోస్తానూ….
    ధన్యవాదములు …….

  7. 7
    ravikumarkosuri Says:

    పత్రిక్ సాహిత్య ప్రపంచానికి ప్రాణం గా నిలుస్తూందీ.

  8. 8
    dvs sarma Says:

    మీ ప్రయత్నం ఎంతొ అభినందనీయం, అందులొ మీరు సఫలీకృతులు కావాలని ఆశిస్తూ … శర్మ, విసశాఖపట్టణం.

  9. 9
    dvs sarma Says:

    మీ ప్రయత్నం ఎంతొ అభినందనీయం, అందులొ మీరు సఫలీకృతులు కావాలని ఆశిస్తూ … శర్మ, విశాఖపట్టణం.

  10. 10
    m.krishna Says:

    ఆర్యా1 నమస్కారములు
    ప్రాణహిత తెలుగుకు ప్రాణం పోసినట్లు ఉంది.
    నేను కథలు వ్రాసినాను. అవి మీకు ఎలాపంపాలి. నాదగ్గర పిడిఫ్ లో ఉన్నాయి. నేను బ్రహ్మలో వ్రాశాను. మీరు తెలిపిన ఐడి యాక్స్పెట్ కావడం లేదు.
    మాదుగుండు కృష్ణ
    హైదరబాద్
    15-6-2008

  11. 11
    Prabhakar Mandaara Says:

    ప్రాణహిత ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు.
    జులై సంచిక కోసమ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
    ప్రభాకర్ మందార, హైదరాబాద్

  12. 12
    kusuma kumari Says:

    సాహితి తరు శాఖలు వీచే చిరు గాలితో అందరికీ కలుగుతూన్నది ఆహ్లాదం

  13. 13
    Nidadavolu Malathi Says:

    సమాజంపట్ల బాధ్యత రచయితలకే కాదండీ సంపాదకులకి కూడా వుండాలి. మీరు నా సైటు పట్ల చూపుతున్న నిర్లక్ష్యం నాకు ఆశ్చర్యంగా వుంది. మీప్రాణహిత మూసేశారని నేను ప్రకటిస్తే మీకు ఎలా వుంటుంది
    - మాలతి.

    http://tethulika.wordpress.com/2008/08/31/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%a4%e0%b1%82%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%a8%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d/

  14. 14
    K.Audisesha Reddy Says:

    ఎడిటరు గారికి’,
    ఈరోజు ప్రాణహిత చూశాను.చక్కగ ఉంది. నిర్వాహకులకు ధన్యవాదాలు. కథలు, కవితలు
    బాగున్నాయి.
    -కైపు ఆదిశేషా రెడ్డి,
    నెల్లూరు (ఆంధ్ర ప్రదేశ)

  15. 15
    cbhavani devi Says:

    పత్రిక చాలా బాగుంది..భవాని

  16. 16
    kusuma kumari Says:

    ఇచ్చట నుండి (‘తెలుగు వ్యాఖ్యల’ బాక్సు నుండి) నా కథానికలు,కవితా రచనలను పంపించ వచ్చునా?

  17. 17
    ranganath middela Says:

    అచ్చ తెనుగు పద సోయగంతో సాహితీప్రియుల మనసు దొచుకున్న అక్షరవారధి

  18. 18
    Anuradha Nippani Says:

    చాలా బాగుంది.
    ఆనురాధ నిప్పాణీ

  19. 19
    BUJJI BABU.G Says:

    ఎడిటరు గారికి’,
    ఈరోజు ప్రాణహిత చూశాను.చక్కగ ఉంది. నిర్వాహకులకు ధన్యవాదాలు. కథలు, కవితలు
    బాగున్నాయి.
    బుజ్జిబాబు.జి

  20. 20
    BUJJI BABU.G Says:

    ఎడిటరు గారికి’,
    ఈరోజు ప్రాణహిత చూశాను.చక్కగ ఉంది. నిర్వాహకులకు ధన్యవాదాలు. కథలు, కవితలు
    బాగున్నాయి.ఇన్కా మంచి కవితలు అందించ గలరని కోరుచున్నాను.
    బుజ్జిబాబు.జి

  21. 21
    srinivas goud Says:

    పత్రిక చాలా బావుంది.వ్యాసాలు ఎక్కువగా వేయండి.

  22. 22
    nutakki raghavendra rao Says:

    ప్రాణహిత హితం కొరుతూ …
    మీ ప్రయత్నం శ్లాఘనీయం. యీ తెలుగు పరికరం అందించిన …ఈమాట…వారు, సంకల్పించిన మీరు అభినందనీయులు. రచయితలకు కూడా యిట్లాంటి పరికరం అందు. బాటులొ వుంచితే, నా బోంట్లకు చాల సౌకర్యంతేఅభినందనలతొ…..
    నూతక్కి రాఘవెంద్ర రావు.

  23. 23
    friend Says:

    http://www.koodali.org lo mee website kalapandi.

  24. 24
    nutakki raghavendra rao Says:

    శ్రి వేముగంటి మురళి గారికి,
    అభినందనలతో,
    మీ యీ తెలుగు కమ్పయిలర్ అనుసంధానం, ఆహ్వానింప తగ్గ ,అభినందించ తగ్గ గొప్ప సౌకర్యమ ని, లోగడ తెలియ చేశాను.
    కేవలం అభిప్రాయాలు తెలియ పరచడానికే పరిమితం కాకుండా,యీ సాంకేతిక సౌకర్యాన్ని మా లాటి ,నూతన గీతకారులను ప్రోత్సాహించే,కోణం లో, వ్రాయాలనే అభిలాషుల రచనలకు కూడా ఆన్ లయిన్లో అందుబాటులోవుంచ గలరని ఆశిస్తూ, ….
    మీ సాహితీ వ్యవసాయం నిరంతరాయంగా కొనసాగాలని , నారు మొక్కలను కూడా నాటి పెంచి పోషించే యత్నం చేస్తూ అప్పుదప్పుదు నారు పోస్తూ నీరు పోయడం మాత్రం మరవ వద్దనీ ,తెలుగు భాషా ఫల సాయాన్నీంతకు పదింతలు చేయాలని ఆశిస్తూ…..మీ శ్రేయోభిలాషి……
    నూతక్కి రాఘవేంద్ర రావు.

  25. 25
    ethakota subbarao Says:

    పత్రిక చాల బాగున్న ది. ……………………………………

  26. 26
    వి వి రాజు Says:

    ప్రాణహిత బాగుంది .తెలుగును ఎలాగైనా బ్రతికించాలనే తపన హర్షించతగినది. మీకు నా అభినందనలు————— వి వి రాజు

  27. 27
    bendalam krishna rao Says:

    ప్రాణహిత ఎంతొ బాగుంది. ఇలాగే కొనసాగించాలి.

  28. 28
    jwalitha Says:

    అస్థిత్వాల కోసం పోరాడుతున్న” మట్టిపూలు వేదిక”రిపోర్టును ప్రచురించినందుకు ధన్య వాదాలు. గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెల చదువు తున్నాను. ప్రాణహిత బాగుంటుంది, అభిప్రా యాలు ఎలా టైపుచేయాలో తెలియక వ్యక్త పరచలేదు.

    జ్వలిత

  29. 29
    vishvasi Says:

    పత్రిక బాగుంది.ఇంతవరకు నాకు తెలియదు నెత్ లొ ఈసౌకర్యం ఉందని.తెలుగు సాహిత్యానికి ఇదొక సెలఏరు.

  30. 30
    annapoorna.a Says:

    ప్రియమైన అరునా
    పత్రిక చాలా బాగుంది. నాకథ్ పమ్పుతున్నాను.
    అన్నపూర్న, మినియాపొలిస్ అమెరికా

  31. 31
    annapoorna.a Says:

    పత్రిక చాలా బాగుంది.ముఖయంగా అభిప్రాయము పమ్పీ అవకాసమ్ ఎచారు ఎదివుపయొగకరముగావుంది.థన్క్స.
    నిర్మల సందిఎగొ అమెరికా

  32. 32
    annapoorna.a Says:

    నావివరాలు.నా రచనాచీయదమ్ మొథత సైగారి రచన పత్రికలొ.ఆ తరవాత వసుంధ్రగారి ప్రూతాషమ్ . నాకథలు25్ వివిథపత్రికలలొ వచ్చయీ.చతురలొ
    3నవలలూవచ్హాఈ. వ్యాసాలూ కవితలూ ( మరూపత్రికలరూవచ్హాఈ
    జయప్రకాష్నారయంగారి లొక్సత్తా పార్తీలొ ఆక్తివమెంబర్ని.మహిలా నాయకురాలిని.
    లొక్సత్తా ఒర్గ్నైజీసతిఒన్లొ 7సంస్తరాలు వలతీర్గాచీసాను.నాకిదిగర్వ కాఅరనము.
    జనబలమ్పత్రికలూ 2యెఅర్స్ వయ్యాసాలురాసాను.నీను పుత్తినది కాకినాద.
    రాజధానిలొ నివాసము. అమెరికా ఆకుపచ్హకార్దువున్నదాన్ని.ఎప్పుదుఅమెరికాలొవున్నాను.
    అన్నపూర్న

  33. 33
    Seela Subhadra Devi Says:

    పత్రిక ని అన్ని సాహితి ప్రక్రియలతో పూర్తి స్తాయి సాహిత్య పత్రిక గా తీసుకు వస్తున్నారు.
    అభినందనలు.

  34. 34
    Sarath 'Kaalam' Says:

    ప్రాణహిత అన్న పేరు చూసి ఎందుకో పౌరహక్కుల పత్రిక ఏమో అనుకొని ఇటు వైపు రాలేదు. ఇన్ని రోజులుగా దీనిలోకి తొంగిచూడకపోవడం నాకే ఆశ్చర్యంగా వుంది.

  35. 35
    Janardhan Says:

    రైటర్‌ టుడే
    –జనార్దన్

    ఇక్కడ అంపశయ్య పడకలు సిద్దం
    ముళ్లపూలే ముద్దబంతులు
    గ్రీష్మతాపమే హేమంతం
    చిరునవ్వుల మాటున హిపోక్రసీ
    మనసారా నవ్వలేని మోమాటం
    నవ్వునాలుగు విధాలా చాటే
    చాటుమాటల్లో దాగిన భవితవ్యం
    అభిప్రాయాలూ ఆశయాలూ ఆవేశాలూ
    మూటగట్టి ముంగిట్లో వదిలేయి
    యాంత్రిక కవళికలను అతికించుకో
    మనసును సీసాలో బిరడాతో మూసేయి
    కీబోర్డుతో రాయాలి కీలుబొమ్మగా మారాలి
    నీ క్రియోటివిటీ తలపులు బోడులు కావాలి
    రాసిందే రాయి మళ్ళీ మళ్లీ రాయి
    అఖరు వాడు రాసిందే కలికి తురాయి
    నువ్వు నువ్వుకాదు నీది నవ్వుకాదు
    భాషతెలిసిన భాండాగారానివి
    బదులివ్వలేని బండరాయివి
    నిజాన్ని నిర్దాక్షిణ్యంగా నీడలో నెట్టి
    నీరెండలో నీటికోసం వెతికే ఆశావాదివి
    నువ్వు నేటితరం హైటెక్‌ శ్రీనాథుడివి
    బతుకుదెరువుకు బతిమాలుకుంటున్న పోతనవి
    కార్పోరేట్‌ విషం నింపుకున్న పూతన బాధితునివి

  36. 36
    Makineedi Surya Bhaskar Says:

    తెలుగు ప్రాణాలకు హితమయినది “ప్రాణహిత”. మీ కృషి బాగున్నది.

  37. 37
    ramnarsimhareddy Says:

    ఎడిటర్ గారికి,

    పత్రిక చాలా బాగుంది.

  38. 38
    tamiri pullarao Says:

    ప్రాణహితలొ అన్ని శీరిషికలు బాగున్నాయి. సాహిత్యప్రహేళికలు ప్రవేశపెట్టండి.-తమిరి పుల్లారావు. విజయవాడ.

  39. 39
    Madipalli Rajkumar Says:

    గోదావరి ఉధృతికి ఉపనదిగా. . . . .
    కాళేశ్వరుని సాక్షిగా. . . .
    సంగమిస్తున్న అమృతవాహిని “ప్రాణహిత” లా. . . .

    సాహితీస్రవంతి ఉన్నతికి ప్రత్యామ్నాయపు పాయగా. . . .
    కాలం సాక్షిగా. . . .
    సహకరిస్తున్న అంతర్వాహిని. . . .అంతర్జాలవాహిని. . . ప్రాణహిత పత్రిక
    కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ. . . . .

  40. 40
    Garimella Nageswara Rao Says:

    నమస్తే…..!
    ప్రాణ హిత ఒక సరి క్రొత్త అక్షర ప్రవాహం. సాంకేతికతను సాహిత్యానికి మేళవించడం వర్తమాన
    కర్తవ్యం.ఈ జీవనది లో పాయలై ప్రవహించేందుకు మేముసైతం….ఉబుకుతూ…ఉరుకుతాం!

    గరిమెళ్ళ నాగేశ్వరరావు,
    విశాఖపట్టణం 48

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో