రచయిత(త్రు)లకు విజ్ఞప్తి
రచయితలకు, రచయిత్రులకు స్వాగతం!
ప్రాణహిత ఆగకుండా ప్రవహించాలంటే సజీవమైన రచనలు ఎంతో అవసరం. సమాజం పట్ల బాధ్యతతో రాసే రచనలు, ప్రజల వైపు నిలబడ్డ రచనలు, ప్రజాస్వామిక భావాలని విలువలని ప్రతిఫలించే రచనలు ప్రాణహితను నిరంతరం ప్రవహించేలా చేస్తాయి. అటువంటి రచనలను వీలయినంతగా సేకరించే ప్రయత్నం మా శాయశక్తులా మేం చేస్తాం. అయితే మా ప్రయత్నం మీ సహకారం లేనిదే విజయవంతం కాలేదు. కాబట్టి మీ రచనలని ప్రాణహితలో ప్రచురణకై మాకు అందచేయాలని మా విన్నపం. వీలయినంత వరకు మరెక్కడా ప్రచురింపబడని (ఇంటర్నెట్ లో బ్లాగు లతో సహా) రచనలయితే ప్రాణహిత కొత్త నీటితో తళ తళ మెరుస్తుంది. అత్యంత సమయోచితమూ, సందర్భానుసారమూ అయినప్పుడూ, తెలుగు నేల పై ప్రచురింపబడి మరీ ప్రాచుర్యంలోకి వచ్చిన రచనలని అంతర్జాతీయ తెలుగు పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో కొన్ని పునర్ముద్రణలు తప్పవని మా అభిప్రాయం. అయితే ఎక్కువ మటుకు తాజా రచనలకే ప్రాధాన్యత నివ్వాలని మా అభిమతం.
ఒక ముఖ్యమైన అంశం మీ దృష్టికి తీసుకు రాదల్చుకున్నాం. ప్రాణహితకి పంపే రచనలు ప్రజల వైపు నిలబడి సామాజిక బాధ్యత తో రాసేవే కాక ఉన్నతమైన సాహితీ విలువలు ఉండి తీరాలని మా అభిప్రాయం. సూక్ష్మం నుండి అనంతం దాకా, నిర్దిష్టత నుండి విశ్వజనీనతనూ ప్రతిఫలించగలిగే రచనలనూ, కలకాలం నిలిచి ఉండే సాహితీ విలువలు గల రచనలనూ, శుష్క రాజకీయ నినాద ప్రాయం కాకుండా, జీవితంలోని, సమాజంలోని విభిన్న కోణాలను దర్శిస్తూ సున్నితంగా, సునిశితంగా, విస్తారంగా మనసుకు హత్తుకునే విధంగా ప్రతిఫలించే రచనలను ప్రచురించి ప్రాణహితను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని మా కోర్కె. ప్రాణహితను సాహితీ పరంగా ఉన్నత శిఖరాలకు తీసికెళ్ళే విధంగా మీ రచనలని మాకందించాలని మా విన్నపం.
మీ రచనలను pranahita.mag[at]gmail.com కి యూనికోడ్ (గౌతమి) ఫాంట్ లో పంపితే మాకు అన్నింటికన్నా సౌకర్యంగా ఉంటుంది. మీ కంప్యూటర్ లో యూనికోడ్ ఇన్‌స్టాల్ చేసుకుని, లేకపోతే http://www.lekhini.org/ లేదా http://www.quillpad.com/telugu సైటులో యూనికోడ్ లో టైప్ చేసి పంపవచ్చు. మీ రచనలు అదివరకే RTS, Shree ఫాంట్స్, Anu ఫాంట్స్, లేదా Telugu Lipi లో టైప్ చేసి ఉంటే వాటిని పద్మ సాఫ్ట్‌వేర్ (http://www.geocities.com/vnagarjuna/padma.html) ని ఉపయోగించి యూనికోడ్ కి మార్చి పంపగలరు. అలా మార్చలేకపోతే RTS, Shree ఫాంట్స్, Anu ఫాంట్స్, Telugu Lipi, ఇంకా ఇతర ఫాంట్స్ లో టైప్ చేసిన రచనలను MS Word లో copy- paste చేసి మాకు పంపితే మేమే వాటిని పద్మ వంటి సాఫ్ట్‌వేర్ లను ఉపయోగించి యూనికోడ్ కి మార్చుకుంటాం. పైన పద్ధతులేమీ వీలు కాని వాళ్లు PDF లో పంపించగలరు. PDF లో పంపితే మేము మళ్లీ టైప్ చేసుకోవాల్సి వస్తుంది కనుక పైన పద్ధతులేవీ వీలుకాని పక్షంలోనే PDF లో పంపగలరని మా విన్నపం. పోస్టులో మీ రచనలను మాకు పంపాలనుకుంటే pranahita.mag[at]gmail.com కి మీరు ఈ-మెయిల్ చేస్తే అమెరికా లేదా హైదరాబాద్ లోని మా పోస్టల్ అడ్రెస్ ను మీకు ఇవ్వగలం.
రచనలు పంపడం గురించి మీకు ఇంకా ఏమైనా సమాచారం అవసరమైతే pranahita.mag[at]gmail.com కి ఈ-మెయిల్ చేస్తే సాధ్యమయినంత త్వరగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇంటర్నెట్ సదుపాయం లేని వారు ఈ కింది చిరునామకి మీ రచనలు పంపవచ్చు.
రచనలు పంపవలసిన చిరునామ:
Pranahita, c/o Vemuganti Murali,
Hno: 11-12-31, Rd #1, Plot# 314,
Sri RamaKrishnaPuram, Snehapuri,
Dilsukhnagar, Hyderabad- 500035
Mobile# +91.99669.48454
ధన్యవాదాలు!
- ప్రాణహిత సంపాదకవర్గం
20 అభిప్రాయాలు »
Pasunoori Ravinder జులై 2007 1
ప్రపంచీకరణ పడగ నీడన తెలుగు భాషా,సాహిత్యాలు కొన ఊపిరితో కొట్టుకుంటున్న వేళ ప్రాణహిత తో ప్రాణం పోసే మీ ప్రయత్నానికి అభినందనలు.
చెర స్పూర్తిని మా తరానికి అందించాలన్న మీ సంకల్పానికి నా జేజేలు.
పత్రిక గురించి ప్రచారం పెంచండి.
ప్రజాకళ వెబ్ పేజిలో ఒక ప్రకటన ఇవ్వండి. సంచిక వెలువడినట్లుగా.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి పరిశోధక విద్యార్థుల పక్షాన
మీ ప్రయత్నం ఫలించాలని ఆశిస్తూ..
పసునూరి రవీందర్
పి.హెచ్. డి. స్కాలర్
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్
desaraju జులై 2007 2
కొత్త పత్రికకు స్వాగతమ్ .
రాకేశ్ తెలంగాణ్ ఆగస్టు 2007 3
తప్పకుండా……….
గత 20 ఏళ్ళుగా నిద్రాణంగా……బూజులుపట్టినట్లున్న-
నా (సాహితీ)కలాన్ని,
లోకాన్ని,
particular brain tissues ని,
ఆలోచనల్ని..
తట్టి..తట్టి మేల్కొలుపుతున్నారు.
అహ నాతో కాదు.. కాదనే సాహసం చేయలేను, చేయను!
నేను మళ్ళీ రాయాలి.
నేనే కాదు - నాలాగే వృత్తి, ప్రవృత్తి వేర్వేరై..
సాహిత్యపు స్పర్శకోసం అనుక్షణం పరితపించే
మరెందరికో “స్ఫూర్తిని” రగిల్చేలా రాయాలి
కసిగా రాయాలి -రసికతగా రాయాలి
తాదాత్మ్యం చెందాలి -సాహితీ మోక్షం సిద్ధించాలి.
మన (సమకాలీన) సమాజానికి సాహిత్యపు ప్రయోజనాలెన్ని రకాలో,
ఎన్ని అత్యవసారాలో…
అన్నిటికన్నీ………… “కనీసం” ప్రయత్నించాలి.
R.Surya Prakash Rao సెప్టెంబర్ 2007 4
ప్రపంచాన్ని శాసిస్తూ, ఊగిస్తూ ప్రపంచీకరణ పడగ నీడ ప్రపంచమంతా పరుచుకున్న వేళ ప్రాణవాయువు అందించడానికి పరుగు ప్రారంభించిన ‘ప్రాణహిత’ కు మనసారా స్వాగతం. ప్రపంచీకర ణలోని భిన్న పార్శ్వాలను పాఠకదేవుళ్ళ హృదయాల్ని తట్టేలా అందజేయాలని మనసారా ఆకాంక్షిస్తూ,
సూర్య ప్రకాశ్ రావు, మేడ్చల్
rajendra నవంబర్ 2007 5
ఫలానా వారి గురించి నీకుతెలుసా అని అడిగి అవథలివాడిని ఒక రకమయిన ఆత్మన్యునతా భావానికి గురి చేసి
ఆనందించే మెధావులకు మనదేశంలొ కొదవ లేదు.నీకన్నా చిన్నవాడు తెలుసుకొ లెకపొవటంలొ వాడి తప్పెంఠ వుందొ నీది అంత కు మించిన తప్పు వుందని మరొక్కసారి ప్రయత్నిస్తున్నందుకు మన సారా అభివాదాలు
bi. Sree daSarathi డిసంబర్ 2007 6
నేనుసైతమ్ మీదు తపములో సమిధనొక్కటి ధారపోస్తానూ….
ధన్యవాదములు …….
ravikumarkosuri మార్చ్ 2008 7
పత్రిక్ సాహిత్య ప్రపంచానికి ప్రాణం గా నిలుస్తూందీ.
dvs sarma ఏప్రిల్ 2008 8
మీ ప్రయత్నం ఎంతొ అభినందనీయం, అందులొ మీరు సఫలీకృతులు కావాలని ఆశిస్తూ … శర్మ, విసశాఖపట్టణం.
dvs sarma ఏప్రిల్ 2008 9
మీ ప్రయత్నం ఎంతొ అభినందనీయం, అందులొ మీరు సఫలీకృతులు కావాలని ఆశిస్తూ … శర్మ, విశాఖపట్టణం.
m.krishna జూన్ 2008 10
ఆర్యా1 నమస్కారములు
ప్రాణహిత తెలుగుకు ప్రాణం పోసినట్లు ఉంది.
నేను కథలు వ్రాసినాను. అవి మీకు ఎలాపంపాలి. నాదగ్గర పిడిఫ్ లో ఉన్నాయి. నేను బ్రహ్మలో వ్రాశాను. మీరు తెలిపిన ఐడి యాక్స్పెట్ కావడం లేదు.
మాదుగుండు కృష్ణ
హైదరబాద్
15-6-2008
Prabhakar Mandaara జూన్ 2008 11
ప్రాణహిత ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు.
జులై సంచిక కోసమ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.
ప్రభాకర్ మందార, హైదరాబాద్
kusuma kumari ఆగస్టు 2008 12
సాహితి తరు శాఖలు వీచే చిరు గాలితో అందరికీ కలుగుతూన్నది ఆహ్లాదం
Nidadavolu Malathi సెప్టెంబర్ 2008 13
సమాజంపట్ల బాధ్యత రచయితలకే కాదండీ సంపాదకులకి కూడా వుండాలి. మీరు నా సైటు పట్ల చూపుతున్న నిర్లక్ష్యం నాకు ఆశ్చర్యంగా వుంది. మీప్రాణహిత మూసేశారని నేను ప్రకటిస్తే మీకు ఎలా వుంటుంది
- మాలతి.
http://tethulika.wordpress.com/2008/08/31/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%a4%e0%b1%82%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%a8%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d/
K.Audisesha Reddy సెప్టెంబర్ 2008 14
ఎడిటరు గారికి’,
ఈరోజు ప్రాణహిత చూశాను.చక్కగ ఉంది. నిర్వాహకులకు ధన్యవాదాలు. కథలు, కవితలు
బాగున్నాయి.
-కైపు ఆదిశేషా రెడ్డి,
నెల్లూరు (ఆంధ్ర ప్రదేశ)
cbhavani devi సెప్టెంబర్ 2008 15
పత్రిక చాలా బాగుంది..భవాని
kusuma kumari సెప్టెంబర్ 2008 16
ఇచ్చట నుండి (’తెలుగు వ్యాఖ్యల’ బాక్సు నుండి) నా కథానికలు,కవితా రచనలను పంపించ వచ్చునా?
ranganath middela సెప్టెంబర్ 2008 17
అచ్చ తెనుగు పద సోయగంతో సాహితీప్రియుల మనసు దొచుకున్న అక్షరవారధి
Anuradha Nippani సెప్టెంబర్ 2008 18
చాలా బాగుంది.
ఆనురాధ నిప్పాణీ
BUJJI BABU.G అక్టోబర్ 2008 19
ఎడిటరు గారికి’,
ఈరోజు ప్రాణహిత చూశాను.చక్కగ ఉంది. నిర్వాహకులకు ధన్యవాదాలు. కథలు, కవితలు
బాగున్నాయి.
బుజ్జిబాబు.జి
BUJJI BABU.G అక్టోబర్ 2008 20
ఎడిటరు గారికి’,
ఈరోజు ప్రాణహిత చూశాను.చక్కగ ఉంది. నిర్వాహకులకు ధన్యవాదాలు. కథలు, కవితలు
బాగున్నాయి.ఇన్కా మంచి కవితలు అందించ గలరని కోరుచున్నాను.
బుజ్జిబాబు.జి